Share News

YSRCP Government: పంటల బీమాకు జగన్‌ ఎగనామం

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:40 AM

రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశామని గొప్పలు చెప్పిన నాటి సీఎం జగన్‌ తన ఐదేళ్ల..

YSRCP Government: పంటల బీమాకు జగన్‌ ఎగనామం

  • ఉచితమంటూ.. ఉత్తుత్తి మాటలు!

  • ఐదేళ్లలో మూడేళ్లు ఫసల్‌ బీమాను పట్టించుకోలేదు

  • లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌

అమరావతి, న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశామని గొప్పలు చెప్పిన నాటి సీఎం జగన్‌ తన ఐదేళ్ల పాలనలో మూడేళ్లపాటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రైతు వాటాగా నయాపైసా చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు బీమా సొమ్ము ఎగనామం పెట్టిన విషయం తేటతెల్లమైంది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ హనుమాన్‌ బేణీవాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పంటల బీమా అమలుపై వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదని, ఇంకొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు రైతులకు ఫసల్‌ బీమా యోజన సొమ్ము ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇకపై రాష్ట్ర వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, దానిపై 12 శాతం వడ్డీ వసూలు చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 2019 ఖరీఫ్‌లో జగన్‌ సర్కార్‌.. పంటల బీమా కింద రైతులతో ఒక్క రూపాయి ప్రీమియం కట్టించింది. అయితే ఆ ఏడాది రబీ సీజన్‌లో ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ వినియోగించుకోలేదు. అలాగే 2020, 2021లో రెండు సీజన్లలోనూ అసలు బీమా యోజన పథకాన్నే వినియోగించుకోలేదు. ఉచిత పంటల బీమా అంటూ కేవలం ఖరీఫ్‌ సీజన్లలో మాత్రమే పరిహారాన్ని అందించింది. 2022లోనూ ఖరీ్‌ఫలో మాత్రమే పంటల బీమా అమలు చేశారు. మళ్లీ 2022-2023 రబీ, 2023 ఖరీఫ్‌, 2023-24 రబీలో ఉచిత పంటల బీమా ఊసే ఎత్తలేదు. దీంతో మూడు పంటల బీమా సొమ్ము రైతులకు సెటిల్‌ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 ఖరీ్‌ఫలో.. అప్పటికి అమలులో ఉన్న ఉచిత బీమానే వర్తింపజేస్తామని ప్రకటించింది. తర్వాత పంటల బీమాపై కమిటీ వేసి 2024-25 రబీ సీజన్‌కు రైతులు తమ వాటా ప్రీమియం చెల్లిస్తే.. బీమా అమలు చేస్తామని ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:41 AM