Jagan: మీరు మీ కొడుకు ఫెయిల్
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:55 AM
YSRCP అధినేత జగన్ చంద్రబాబు, లోకేశ్‌లపై 10వ తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమై విద్యారంగం భ్రష్టు పట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు క్షోభకు గురైనందుకు తప్పిదానికి బాధ్యులైన వారికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీ అసమర్థతతో పదో క్లాస్ విద్యార్థులకు క్షోభ
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై జగన్ విమర్శ
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబుగారూ... మీరు, మీ కొడుకు లోకేశ్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారు’ అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీ పాలనలో విద్యారంగం భ్రష్ఠు పట్టిపోయింది. పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకెంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది. రాష్ట్రంలో 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలు సక్రమంగా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమయ్యారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశారు. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News