Share News

Waterways Authority: జల రవాణాలో పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - May 24 , 2025 | 03:09 AM

జల రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నదీ మార్గాలను అభివృద్ధి చేసి ఆర్థిక ప్రగతికి వేదికగా మార్చాలని భావిస్తున్నారు.

Waterways Authority: జల రవాణాలో పెట్టుబడులు పెట్టండి

  • వాటర్‌వేస్‌ అథారిటీ చైర్మన్‌గా శివప్రసాద్‌ బాధ్యతలు

అమరావతి, మే23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం చేసేందుకు కృషి చేస్తానని ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ చైర్మన్‌ జెడ్‌.శివప్రసాద్‌ చెప్పారు. జల రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. శుక్రవారం తాడేపల్లిలోని వాటర్‌వేస్‌ అథారిటీ కార్యాలయంలో చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ దేశీయ జల మార్గం ద్వారా వస్తు, ప్రజల రవాణా వల్ల ఖర్చు తగ్గడంతో పాటు, రోడ్‌ ట్రాఫిక్‌ తగ్గుతుందని చెప్పారు. రోడ్డు, రైలు రవాణా కంటే జల రవాణా ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో జల రవాణా, కార్గో సేవలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.

Updated Date - May 24 , 2025 | 03:10 AM