International Yoga Day: జూన్ 21న విశాఖకు మోదీ
ABN , Publish Date - May 15 , 2025 | 04:28 AM
జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతూ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, ప్రముఖ యోగా సంస్థలతో కలిసి సుమారు 2 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్ విజయానంద్ సంబంధితశాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News