Share News

Visakhapatnam: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ నీలగిరి

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:37 AM

తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎ్‌స నీలగిరి’ ఆదివారం తూర్పు నౌకాదళంలోకి వచ్చింది.

 Visakhapatnam: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ నీలగిరి

  • విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక

  • తూర్పు నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ నీలగిరి

  • విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక

విశాఖపట్నం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎ్‌స నీలగిరి’ ఆదివారం తూర్పు నౌకాదళంలోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక తూర్పు నౌకాదళం అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్టు 17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్స్‌ శ్రేణిలో ఈ యుద్ధ నౌకను నిర్మించారు. ఈ తరహా శ్రేణిలో నిర్మించిన తొలి నౌక ఇదే కావడం గమనార్హం. ముంబై నావల్‌ డాక్‌ యార్డులో ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్‌ నీలగిరిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఈ యుద్ధ నౌక రాకతో తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుంది.

Updated Date - Jun 23 , 2025 | 06:37 AM