Indosol Water Supply: ఇండోసోల్‌కు సోమశిల నుంచి ఏటా 1.48 టీఎంసీలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:44 AM
ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సోమశిల రిజర్వాయరు నుంచి ఏటా 1.48 టీఎంసీలు నీటిని సరఫరా చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపించే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

జల వనరుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్‌పీఎల్)కు సోమశిల రిజర్వాయరు నుంచి ఏటా 1.48 టీఎంసీల నీరు సరఫరా చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానళ్ల తయారీ ప్లాంటును, సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందుకు గాను పారిశ్రామిక విధానంలో భాగంగా ఈ సంస్థకు నీటిని కేటాయించాలని నిశ్చయించినట్లు పేర్కొంటూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నీటి సరఫరాకు అవసరమైన కార్యాచరణ చేపట్టేలా ఎన్‌టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలివ్వాలని ఇంజనీర్-ఇన్-చీఫ్(ఈఎన్‌సీ)ని ఆదేశించారు.
Read Latest AP News And Telugu News