ReNew Power Project: అనంతలో భారీ ఇంధన కాంప్లెక్స్
ABN , Publish Date - May 15 , 2025 | 02:45 AM
దావోస్‌లో జరిగిన ఒప్పందాల ప్రకారం అనంతపురంలో రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్ ఏర్పాటవుతోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 72 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అమలు కానున్నాయి.
22 వేల కోట్లతో రెన్యూ సంస్థ ఏర్పాటు
దేశంలో పెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ప్రాజెక్టు
రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
కార్యరూపం దాలుస్తున్న దావోస్ ఒప్పందాలు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): దావోస్ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జరిగిన అవగాహనా ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. రూ. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది. దీనిని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ప్రముఖ సంస్థ రెన్యూ ఏర్పాటు చేస్తోంది. రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌కు 16న మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలిదశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్లను ఆ సంస్థ స్థాపించనుంది. ఇక్కడ మొత్తంగా 1,800 మెగావాట్ల సౌర, 2,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ను వివిధ దశల్లో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తుంది. కాగా, 2019-24 మధ్య జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాలేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలనూ అమ లు చేయకుండా జగన్ సర్కారు నిలిపివేసింది.
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ ఈ ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. దావోస్ సదస్సులో రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హాతో మంత్రి లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ఇంధన శాఖ ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ప్రాజెక్టు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతోంది. రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 72 గిగావాట్ల విద్యుత్తు ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. 65,000 కోట్లతో 500 మెగావాట్ల కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంటును రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంటు తొలిదశకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ. 1.85 లక్షల కోట్లతో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును, వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా 10,000 మెగావాట్ల ప్రాజెక్టును, రూ. 50,000 కోట్లతో ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్ 1,200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ప్లాంటును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News