Share News

Pawan Kalyan : కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 10:37 AM

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు.

Pawan Kalyan :  కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌
Pawan Kalyan

కాకినాడ, ఆగస్టు 15 : కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

pawan.jpg ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. రూ.7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్‌ చెప్పారు. 2024లో రూ.380 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.

pawan-4.jpgసుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్.. పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

pawan-3.jpgపులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్.. వైసీపీ వాళ్లు.. గెలిస్తే ప్రజాతీర్పు అంటారు.. కూటమి గెలిస్తే EVMల తప్పా? అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎద్దేవా చేశారు.

pawan-2.jpg

Updated Date - Aug 15 , 2025 | 11:11 AM