Share News

Bheemavaram python video: భీమవరంలో భారీ కొండచిలువ హల్‌చల్..

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:40 PM

కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ప్రస్తుత చలికాలంలో పాములు, కొండచిలువలు జనవాసాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది

Bheemavaram python video: భీమవరంలో భారీ కొండచిలువ హల్‌చల్..
huge python spotted

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ప్రస్తుత చలికాలంలో పాములు, కొండచిలువలు జనవాసాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (huge python spotted).


ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో తాజాగా ఓ భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది (snake video viral). యనమదుర్రు డ్రైన్ నుంచి పంటచేలకు నీరు తోడుతుండగా ఆ భారీ కొండచిలువ బయటకు వచ్చింది. ఆ కొండచిలువ ఇరవై అడుగులకు పైనే ఉంది. అది కాలువ నీటి ట్యాంక్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ భారీ కొండచిలువను చూసి స్థానికులు భయపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 15 , 2025 | 06:00 PM