Dalit Victims : వైసీపీ అకృత్యాలకు బలైన దళితుల కేసులు పునర్విచారణ
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:24 AM
విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) నాయకుడు బూసి వెంకటరావు నేతృత్వంలో కోడి కత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు,

హోం మంత్రి వంగలపూడి అనిత హామీ
కోడికత్తి కేసును పోలీసు శాఖకు బదిలీ చేయాలని నిందితుడి వినతి
నక్కపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో అకృత్యాలకు బలైన దళిత బాధితుల కేసులను పునర్విచారణ చేయిస్తామని, ఎస్పీల నుంచి నివేదికలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) నాయకుడు బూసి వెంకటరావు నేతృత్వంలో కోడి కత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు, వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి వీధి సుబ్రహ్మణ్యం, విశాఖ జైలులో మృతిచెందిన వ్యక్తి కుటుంబీకులు శనివారం నక్కపల్లిలో హోంమంత్రి అనితను కలిసి వినతిపత్రం అందజేశారు. కోడికత్తి వ్యవహారంలో టెర్రరిస్ట్ కుట్ర, రాజకీయ కుట్ర లేదని ఎన్‌ఐఏ నివేదిక ఇచ్చినందున కేసును రాష్ట్ర పోలీస్ శాఖకు బదిలీ చేయాలని వెంకటరావు, నిందితుడు శ్రీనివాసరావు కోరారు. వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన కుటుంబాలకు న్యాయం చేయాలని వెంకటరావు కోరారు.