High Court Orders : అనారోగ్య సమస్యలకు హాజరు నిబంధన సరికాదు
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:40 AM
నాలుగో సెమిస్టర్‌కు అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హాజరును 10శాతం వరకే మినహాయించగలమని జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ్‌స (జీఎంఆర్‌ఐటీ) కళాశాల యాజమాన్యం చెప్పడాన్ని తప్పుబట్టింది.
విద్యార్ధి కౌశిక్ మూడో సెమిస్టర్ ఫలితాలు వెల్లడించండి
నాలుగో సెమిస్టర్ క్లాస్లులకు కూడా అనుమతించండి: హైకోర్టు
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణాలతో తరగతులకు హాజరుకాలేకపోయిన విద్యార్థికి హాజరు తక్కువుగా ఉందనే కారణంతో మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు వెల్లడించకపోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగో సెమిస్టర్‌కు అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హాజరును 10శాతం వరకే మినహాయించగలమని జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ్‌స (జీఎంఆర్‌ఐటీ) కళాశాల యాజమాన్యం చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆ నిబంధన ప్రభుత్వ సంస్థలు రూపొందించలేదని పేర్కొంది. పిటిషనర్ కౌసిక్ మూడవ సెమిస్టర్ ఫలితాలు వెల్లడించాలని, అలాగే నాలుగవ సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని జీఎంఆర్‌ఐటీని ఆదేశించింది. పిటిషనర్ బీటెక్ కోర్సు పూర్తి చేసేందుకు అనుమతించాలని జీఎంఆర్‌ఐటీ కళాశాల, రాష్ట్ర విద్యాశాఖ, జేఎన్‌టీయూ వైస్‌చాన్సలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని జీఎంఆర్‌ఐటీలో విద్యార్ధి బీవీకే కౌశిక్ బీటెక్(ఏఐ)ను అభ్యసిస్తున్నాడు. అనారోగ్యం వల్ల మూడో సెమిస్టర్‌లో హాజరు తగ్గింది. దీనికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాడు. హాజరు65ు కన్నా తక్కువ ఉందనే కారణంతో కళాశాల యాజమాన్యం అతన్ని పరీక్షలకు అనుమతించలేదు. దీంతో కౌశిక్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News