Share News

Anantapuram: ఈదురు గాలుల బీభత్సం

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:53 AM

అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 1050.47 హెక్టార్లలో రూ.10.29 కోట్ల పంట నష్టం జరిగింది

Anantapuram: ఈదురు గాలుల బీభత్సం

  • అనంతలో రూ.10.29 కోట్ల పంట నష్టం

  • నెల్లూరు జిల్లాలో తడిసిన ధాన్యం.. రైతుల గగ్గోలు

అనంతపురం అర్బన్‌, వెంకటాచలం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1050.47 హెక్టార్లల్లో రూ.10.29 కోట్ల విలువైన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కోత దశలో పంటలు దెబ్బతినడంతో పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం నీటిపాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం గ్రామాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు.

Updated Date - Apr 12 , 2025 | 06:53 AM