Share News

Andhra Weather Update: బలహీనపడిన అల్పపీడనం

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:04 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. నేటి నుంచి కోస్తా జిల్లాల్లో మళ్లీ వడగండ్లు తాకే అవకాశం ఉంది

Andhra Weather Update: బలహీనపడిన అల్పపీడనం

  • నేటి నుంచి మళ్లీ సెగలే

  • బలహీనపడిన అల్పపీడనం.. నేటి నుంచి సెగలే

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజులపాటు కొనసాగిన అల్పపీడనం శుక్రవారం బలహీనపడింది. అయితే దానిపై ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కాగా, కోస్తా జిల్లాల్లో శనివారం నుంచి మళ్లీ వడగాడ్పులు పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం కడప జిల్లా అట్లూరులో 41.4, ప్రకాశం జిల్లా గుంటుపల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, 28 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 05:04 AM