Gurajala court: తురకా కిశోర్‌కు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:08 AM
మాచర్ల మాజీ చైర్మన్ తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసులో గురజాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు, కిశోర్‌ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.
హత్యాయత్నం కేసులో గురజాల కోర్టు ఉత్తర్వులు
కారంపూడి, మే 31 (ఆంధ్రజ్యోతి): హత్యాయత్నం కేసులో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నేత తురకా కిశోర్‌కు గురజాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న కిశోర్‌ను పీటీ వారంట్‌పై శనివారం గురజాల కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి పి.అలేఖ్య రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. 2023 నవంబరు 12వ తేదీ రాత్రి కారంపూడి మండలంలోని చింతపల్లి గ్రామంలో గమిడి పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లి వైసీపీలోకి మారాలని మారణాయుధాలతో మహిళలను సైతం బెదిరించి దాడి చేయబోయాడని బాధితుడు పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఫిర్యాదును పోలీ్‌సస్టేషన్లో తీసుకోలేదని, ప్రభుత్వం మారగానే మళ్లీ ఫిర్యాదు చేశానని పూర్ణచంద్రరావు తెలిపారు. కిశోర్, ఎంపీపీ మేకల శ్రీనివాసరెడ్డి, మరో నేత చిరుమామిళ్ల శ్రీకాంత్‌తోపాటు మరికొందరు బెదిరించిన వారిలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ పరారీలో ఉన్నారని ఎస్‌ఐ వాసు తెలిపారు. తురకా కిశోర్‌ను తిరిగి గుంటూరు జైలుకు తరలించామన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News