Share News

Guntur: ‘మొలకెత్తిన’ అభిమానం

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:11 AM

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం అత్తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎర్రు బాపారావు ఆధ్వర్యంలో ‘కూటమి’ ప్రభుత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Guntur: ‘మొలకెత్తిన’ అభిమానం

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం అత్తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎర్రు బాపారావు ఆధ్వర్యంలో ‘కూటమి’ ప్రభుత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2.5 ఎకరాల్లో ఎర్ర తోటకూర, జనుము విత్తనాలతో జనసేన లోగో, దానికింద డిప్యూటీ సీఎం ఆఫ్‌ ఏపీ అన్న అక్షరాలతో పంటను మొలకెత్తించారు. రాష్ట్రం కోసం చంద్రబాబుతో జతకట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం 15 సంవత్సరాలు బాబుతో కలిసి నడుస్తామని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు భాషలో శుభాకాంక్షలు చెపుతున్నామని రైతు బాపారావు తెలిపారు.

- తెనాలి, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 14 , 2025 | 04:11 AM