Share News

Commission Inquiry: సమాచార కమిషన్‌ పై సర్కారు సీరియస్‌

ABN , Publish Date - May 07 , 2025 | 06:42 AM

సమాచార కమిషన్‌ కార్యాలయంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుంది. ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్‌ విచారణ చేపట్టి, సోమవారం జరిగిన సంఘటనపై వివరాలు సేకరించా

Commission Inquiry: సమాచార కమిషన్‌ పై సర్కారు సీరియస్‌

  • విచారణ చేపట్టిన సీఎస్‌

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): సమాచార కమిషన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన వ్యవహారాన్ని ప్రభు త్వం సీరియ్‌సగా పరిగణించింది. అఖిల భారత సర్వీసు అధికారిని తన కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా భావించింది. కమిషన్‌ సెక్రటరీ గదికి తాళాలు వేయడంతోపాటు, ప్రభుత్వం నియమించిన సెక్రటరీని లోపలికి వెళ్లనీయకుండా బయట వేచి ఉండేలా చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ విచారణ చేపట్టారు. కమిషన్‌ కార్యాలయం నుంచి ఇద్దరు ఉద్యోగులను మంగళవారం పిలిపించి, కార్యాలయంలో సోమవారం ఏం జరిగిందన్న సమాచారం సేకరించారు. కార్యాలయంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని ఆ ఉద్యోగులు సీఎ్‌సకు వివరించారు. మరోవైపు సోమవారం జరిగిన పరిణామాలపై కొత్త సెక్రటరీ ఆంజనేయులు సీఎ్‌సకు కాన్ఫిడెన్షియల్‌ నివేదికను అందించారు. మరోవైపు ఆంజనేయులు బుధవారం ఉదయం సీఎస్‌ విజయానంద్‌ను నేరుగా కలిసి కమిషన్‌ కార్యాలయంలో జరుగుతున్న విషయాలన్నీ వివరించనున్నారు.

Updated Date - May 07 , 2025 | 06:42 AM