Share News

APGENCO: సీలేరు శంకుస్థాపనకు సిద్ధమవండి

ABN , Publish Date - May 31 , 2025 | 05:30 AM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1350 మెగావాట్ల అప్పర్ సీలెరు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేపట్టాలని ఏపీజెన్కో CMDకి ఆదేశించారు. 2024-25 సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి 14% పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

APGENCO: సీలేరు శంకుస్థాపనకు సిద్ధమవండి

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): 1,350 మెగావాట్ల అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం శంకుస్థాపనకు సిద్ధం కావాలని ఏపీజెన్కో సీఎండీ కేవీఎన్‌ చక్రధరబాబును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయాంద్‌ ఆదేశించారు. ఏపీ జెన్కో విద్యుత్తు ప్రాజెక్టులపై శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకూ 14శాతం వృద్ధితో ఏపీ జెన్కో, ఏపీ పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ విద్యుదుత్పత్తి చేయడంపై సీఎస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఏపీజెన్కో థర్మల్‌ విద్యుదుత్పత్తి 9శాతం పెరిగిందన్నారు. 2027 జనవరి నాటికి 960 మెగావాట్ల పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని పూర్తిచేయాలన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:30 AM