Cocoa Support Price: కోకో మద్దతు ధరకు నిధుల విడుదల
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:51 AM
ప్రస్తుత సీజన్‌లో అమ్ముడుపోని 2,976.76 టన్నుల కోకో గింజలను ప్రభుత్వం సేకరించింది.
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో అమ్ముడుపోని 2,976.76 టన్నుల కోకో గింజలను ప్రభుత్వం సేకరించింది. కోకో గింజలు కిలో రూ.500గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.450 వ్యాపారులు, రూ.50 ప్రభుత్వం ఇస్తోంది. రైతులకిచ్చిన బోనస్ కింద రూ.14,884కోట్లు ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఉద్యాన శాఖ వ్యాపారులకు చెల్లించనున్నది.