Share News

Paper Evaluation: 8863 పేపరల్లో స్వల్ప వ్యత్సాసమే

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:02 AM

పదో తరగతి పరీక్షల మూల్యాంకనలో తక్కువ పొరపాట్లు మాత్రమే జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ద్వారా కొంతమందికి మార్కులు మారినప్పటికీ, ఇది మొత్తం పేపర్లలో స్వల్పశాతం మాత్రమే అని వివరించారు.

Paper Evaluation: 8863 పేపరల్లో స్వల్ప వ్యత్సాసమే

0.068శాతం పేపర్లలోనే ఎక్కువ మార్కుల తేడా

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి వెల్లడి

టెన్త్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తేడాలపై వివరణ

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు స్వల్పమేనని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. మూల్యాంకనంలో పొరపాట్లపై శనివారం ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 45,96,527 పేపర్లు మూల్యాంకనం చేశామని, ప్రతి అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ రోజుకు 40 పేపర్ల చొప్పున దిద్దారని తెలిపారు. మూల్యాంకనంలో కచ్చితత్వం 2025లో మెరుగ్గానే ఉందన్నారు. 2022లో 99.82శాతం, 2023లో 99.76శాతం, 2024లో 99.81శాతం, 2025లో 99.76శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందని చెప్పారు. 66,363 పేపర్ల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 11,175 పేపర్లలో మార్కులు మారాయన్నారు. 8,863 పేపర్లలో 5 మార్కుల లోపే మారాయని, 3,119 పేపర్లలో 5 మార్కులు దాటి మారాయని వివరించారు. ఎక్కువ మార్కులు మారింది కేవలం 0.068శాతం పేపర్లలో మాత్రమేనన్నారు. ఈ పొరపాట్ల వల్ల అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల కోసం ఆర్జీయూకేటీ ఈనెల 2 నుంచి 10 వరకు దరఖాస్తులకు మరో అవకాశం కల్పించిందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:02 AM