CRU Notification: పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో సీఆర్‌యూ నోటిఫై
ABN , Publish Date - May 02 , 2025 | 05:52 AM
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ (సీఆర్‌యూ)ను నోటిఫై చేసింది. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ పన్ను నిర్వహణలో సమర్థతను చూపించిందని ప్రభుత్వాన్ని సూచించి, దీనిని కొనసాగించాలని అభ్యర్థించారు
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రీకృతం చేస్తూ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ (సీఆర్‌యూ)ను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయిలో సీఆర్‌యూను ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. పన్ను నిర్వహణలో సమర్థత, ప్రభావవంతమైన పనితీరు కనిపిస్తుండటంతో ఈ సీఆర్‌యూను కొనసాగించే అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కమిషనర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. నిశితంగా పరిశీలించిన సర్కారు దానిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చింది.