Andhra Pradesh: నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.25 వేల భృతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 07:28 PM
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.