New Investments: చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:32 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు.
సమావేశంలో మంత్రి లోకేశ్, కరణ్ అదానీ
సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అదానీ సీఎంతో కలసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులపై ఇరువురూ చర్చించుకున్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో పోర్టులు, డేటా సెంటర్, సిమెంటు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా, రానున్న రోజుల్లో రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టబోయే పెట్టుబడులపైనా చర్చ జరిగింది. ఈ భేటీలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ, మంత్రి లోకేశ్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Alcohol Sale: 8 నెలలు.. 20వేల కోట్లు
Kakinada District: ఉప్పాడ తీరంలో అలల ఉధృతి