Share News

Kakinada District: ఉప్పాడ తీరంలో అలల ఉధృతి

ABN , Publish Date - Dec 04 , 2025 | 07:07 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది.

Kakinada District: ఉప్పాడ తీరంలో అలల ఉధృతి

  • కోనపాపపేటలో ధ్వంసమైన ఇళ్లు

కొత్తపల్లి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. మంగళ, బుధవారాల్లో సముద్రంలో ఏర్పడిన పోటు, పాట్లకు ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాల ధాటికి కోనపాపపేట తీ రంలో మత్స్యకారుల తాటాకుపాక దెబ్బతినగా మ రో పక్కా ఇంటి శ్లాబు నేలకొరిగింది. కోనపాపపేట గ్రామానికి సముద్రం రెండు, మూడు ఫర్లాంగుల దూరంలో ఉండేది. కానీ, ఇటీవల కాలంలో తరచూ తుఫాన్‌లు, అల్పపీడనాలు సంభవించడంతో క్రమేపీ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు అతి దగ్గరగా చేరుకోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 07:07 AM