Yarada Beach Accident: యారాడ బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన విదేశీయులు..
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:44 PM
యారాడ బీచ్‌లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన చాలా మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా..
విశాఖ: యారాడ బీచ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు దిగిన నలుగురు విదేశీయులు నీటిలో కొట్టుకుపోయారు. లైఫ్ గాడ్స్ వీరిలో ఇద్దరిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బయటకు తీసుకువచ్చిన వారికి లైఫ్ గాడ్స్ సీపీఆర్ చేశారు. ఇద్దరిలో ఓ వ్యక్తి సీపీఆర్ కారణంగా బతికాడు. మరో వ్యక్తి చనిపోయాడు. రెస్క్యూ సిబ్బంది సముద్రంలో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.
ఇటలీకి చెందిన మొత్తం 16 మంది పర్యాటకులు యారాడ బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందరూ సముద్రంలో దిగి ఈత కొడుతూ ఉండగా అలల ధాటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, యారాడ బీచ్ లో తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన చాలా మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనూ 8మంది ఇటలీ పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు. లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
మరో ఘటనలో..
పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో విజయవాడకు చెందిన ఎం ప్రవీణ్ గల్లంతయ్యాడు. స్నానం చేస్తుండగా అలలు ఎగసిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ పాడుపని.. యువతితో అసభ్య ప్రవర్తన..
13 మంది మృతి.. వైన్ షాపు ధ్వంసం చేసిన మహిళలు.. లక్షల సొమ్ము నేలపాలు..