Fishermen Protest: ఫలించిన చర్చలు.. ఆందోళన విరమించిన మత్స్యకారులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 09:54 PM
కలెక్టర్, హోం మంత్రి సమాధానం చెప్పాలంటూ మత్స్యకారులు నక్కపల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓతో పాటు పలువురు అధికారులు మత్స్యకారుల దగ్గరకు వెళ్లారు.
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్, హోం మంత్రి సమాధానం చెప్పాలంటూ మత్స్యకారులు నక్కపల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓతో పాటు పలువురు అధికారులు మత్స్యకారుల దగ్గరకు వెళ్లారు. వారితో చర్చలు జరిపారు. అయితే, అధికారులు మాట్లాడినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు.
మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో హైవేపై కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా రంగంలోకి దిగారు. మత్స్యకారుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపారు. మత్స్యకారులు తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 15వ తేదీన రాజయ్యపేట మత్స్యకారులతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక పోలీస్ అధికారుల పనితీరును పరిశీలన జరుపుతామని ఎస్పీ అన్నారు. కలెక్టర్, ఎస్పీ హామీల నేపథ్యంలో మత్స్యకారులు ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..
నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు: సీఎం చంద్రబాబు