Mini Mahanadu Riyadh: రియాధ్‌లో తొలిసారిగా మినీ మహానాడు
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:29 AM
సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో తొలిసారిగా నిర్వహించిన మినీ మహానాడు ప్రవాసాంధ్రుల ఉత్సాహాన్ని చాటింది. చంద్రబాబు నాయకత్వం, లోకేశ్ విదేశీ ప్రవాసుల కోసం చేస్తున్న కృషిపై నేతలు ప్రశంసలు గుప్పించారు.
సౌదీలో నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో తొలిసారిగా మినీ మహానాడు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ప్రముఖులు షేక్ జానీ బాషా, చెన్నుపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మినీ మహానాడు నిర్వహించారు. ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రవాసీయులు ఈ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకొన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగువారికి చేరువ కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేస్తున్న కృషిని వివరించారు. తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రవాసీయులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం చేసుకోవడానికి ఏపీ ఎన్నార్టీ సంస్థ దర్శన విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు స్లాట్ల సంఖ్య పెంచిందని రాధాకృష్ణ వెల్లడించారు. స్థానిక చట్టాలకు లోబడి.. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో పార్టీని విస్తరించనున్నట్టు తెలుగుదేశం ఎన్నారై సౌదీ అరేబియా శాఖ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా పెర్కొన్నారు. రియాధ్, ఇతర గల్ఫ్ దేశాల నుంచి విజయవాడ, విశాఖపట్నం నగరాలకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని జానీ బాషా, రాజశేఖర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news