Fire NOC: ఇంటర్ కాలేజీలకు ఫైర్ అడ్డంకి
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:31 AM
తొమ్మిది మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న జీ+2 భవనాల్లో కొనసాగుత్నున ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్‌వోసీ నుంచి 2020లో మినహాయింపునిచ్చారు.
ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఘం
ఇంటర్మీడియట్ కాలేజీల అఫిలియేషన్లకు ఫైర్ ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అడ్డంకిగా మారిందని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తొమ్మిది మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న జీ+2 భవనాల్లో కొనసాగుత్నున ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్‌వోసీ నుంచి 2020లో మినహాయింపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వాటికి కూడా తప్పనిసరిగా ఫైర్ ఎన్‌వోసీ ఉండాలని ఇంటర్ విద్యామండలి అధికారులు స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఫైర్ ఎన్‌వోసీ ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నాయి. దీనిపై ఏపీ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు బుధవారం మంగళగిరిలో సమావేశమయ్యారు. జీ+2 భవనాలకు కూడా ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి చేస్తే గ్రామీణ, విద్యార్థులు తక్కువగా ఉండే కాలేజీలకు కష్టంగా మారుతుందన్నారు. జీ+2 భవనాలకు మినహాయింపు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ను కోరాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు వీవీ ప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News