Kasu Mahesh Reddy: ఈ రోజు ఒక కేసు పెడితే.. రేపు 3 కేసులు పెడతాం
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:17 AM
ఈ రోజు ఒక కేసు పెడితే రేపు మూడు కేసులు పెడతామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి హెచ్చరించారు...
వైసీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి హెచ్చరిక
సత్తెనపల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఈ రోజు ఒక కేసు పెడితే రేపు మూడు కేసులు పెడతామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి హెచ్చరించారు. కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి బుధవారం జరిగిన విచారణకు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్‌రెడ్డి హాజరయ్యారు. వారిని విచారించిన సీఐ నాగమల్లేశ్వరరావు... ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం మహేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 113 మంది మీద కేసులు పెట్టారని, 10లక్షల మంది మీద కేసులు పెట్టినా ఏమీకాదని అన్నారు. పల్నాడులో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు.