Share News

Land Scam: రాజధానిలో దళారుల దందా!

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:44 AM

కొర్రీలు పెట్టి రైతుల ప్లాట్ల ధరలు తగ్గించేస్తున్నారు. కారు చౌకగా కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రిటర్నబుల్‌ ప్లాట్లదీ ఒకే స్వభావం.

Land Scam: రాజధానిలో దళారుల దందా!

చౌకగా రిటర్నబుల్‌ ప్లాట్లు కాజేసేందుకు కుట్ర

అసైన్డ్‌ రైతులకు ఇచ్చిన ప్లాట్లే టార్గెట్‌ గత సర్కారు పెట్టిన సీఐడీ కేసులు బూచిగా చూపి బెదిరింపులు.. ధర రాదంటూ ప్రచారం

గజానికి 10 నుంచి 20 వేల వరకు తగ్గింపు

కేసులు ఎత్తేసినా రైతులకు తప్పని తిప్పలు

సర్కారు స్పష్టమైన ప్రకటన చేయాలని విన్నపం

గుంటూరుకు చెందిన ఒక ఇంజనీర్‌ రాజధానిలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన ఒక అసైన్డ్‌ రైతు వద్ద ప్రభుత్వం ఇచ్చిన 110 గజాల రిటర్నబుల్‌ ప్లాటును కొన్నారు. గజానికి రూ.38 వేలు చొప్పున రైతుకు చెల్లించారు. ఆ మరుసటి రోజే గజం రూ.55 వేలకు బేరం పెట్టి అమ్మేసుకున్నారు.

కురగల్లులో ఓ అసైన్డ్‌ రైతు తనకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాటును బేరం పెట్టారు. సాధారణంగా గజం ధర రూ.50 వేలు పలుకుతుండగా, ఆ రైతు ప్లాటును దళారులు గజం రూ.30 వేలకు అడుగుతున్నారు. అదేమంటే.. అసైన్డ్‌ ప్లాట్‌ అంటూ దగా చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధానిలో రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లకు విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో దళారులు అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. కొర్రీలు పెట్టి రైతుల ప్లాట్ల ధరలు తగ్గించేస్తున్నారు. కారు చౌకగా కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రిటర్నబుల్‌ ప్లాట్లదీ ఒకే స్వభావం. అయితే దళారులు అసైన్డ్‌ రైతుల భూములను ప్రధానంగా టార్గెట్‌ చేసుకున్నారు. వాటి ధరలు తగ్గించి, వాటిని చూపి సాధారణ రైతుల ప్లాట్ల ధరలు కూడా తగ్గించి కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసైన్డ్‌ రైతులపై పెట్టిన తప్పుడు సీఐడీ కేసులను వాడుకొని వారిని లూటీ చేస్తున్నారు.



వైసీపీ హయాంలో చిక్కులు

రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం భూసమీకరణ పద్ధతిలో భూములు సేకరించింది. రాజధాని కోసం 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో 29 గ్రామాలకు చెందిన 3,139 మంది అసైన్డ్‌ రైతులు 2,689.14 ఎకరాలు ఇచ్చారు. వారి భూములపై గత వైసీపీ ప్రభుత్వం సీఐడీ కేసులు వేసింది. వారి స్థలాలను నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పెట్టి ఐదేళ్లపాటు వేధించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ భూములను అసైన్డ్‌ చెర నుంచి తప్పించింది. సాధారణ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల తరహాలో వీటికి కూడా సర్వహక్కులూ కల్పించింది.

తప్పుడు ప్రచారంతో దగా

సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లను ప్రభుత్వం చట్టపరంగా రిజిస్టర్‌ చేసి అందిస్తోంది. అలా ఇచ్చే క్రమంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి స్వభావం అనే కాలమ్‌ వద్ద ‘అసైన్డ్‌’ అని నమోదు చేస్తోంది. ఈ పదాన్ని అడ్డం పెట్టుకుని దళారులు రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు ‘అసైన్డ్‌’ స్వభావం ఉంటుందని చెప్పి, వాటికి ఎలాంటి హక్కులూ సంక్రమించవని, బ్యాంకుల నుంచి రుణాలు రావని చెబుతూ రేట్లు తెగ్గోస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణ పేరుతో చేసిన నిర్వాకమే అసైన్డ్‌ రైతుల పాలిట శాపంగా మారింది. విచారణ పేరుతో వారి పొలాలను నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని వైసీపీ ప్రభుత్వంలో గజం రూ.35 వేలు ఉన్న స్థలాలను రూ.10, 12వేలకు దళారులు కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే పద్ధతిలో రైతులను దోపిడీ చేయాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం సీఐడీ కేసులు తొలగించి, నాట్‌ ట్యాలీడ్‌ జాబితా నుంచి అసైన్డ్‌ పొలాలకు విముక్తి కల్పించాక కూడా గత ప్రభుత్వం పెట్టిన కేసుల వంకలను చూపి రైతులను దగా చేస్తున్నారు. ప్రభుత్వం మారితే మళ్లీ సమస్యలు వస్తాయని, అసైన్డ్‌ రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎప్పటికైనా ఇబ్బంది తప్పదని, వాటి రిజిస్ట్రేషన్లు చెల్లవని దళారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏడేళ్ల పాటు కౌలు ఇచ్చిన తరువాత అసైన్డ్‌ రైతుల కౌలు ఆగిపోయి, నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పడడాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మళ్లీ అలాంటి సమస్యలే వస్తాయని రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు.

- గుంటూరు, ఆంధ్రజ్యోతి


సీఆర్డీఏ స్పందించాలి..

రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం గజం భూమి ధర రూ.50 నుంచి 70 వేల వరకూ పలుకుతోంది. కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం, మందడం ప్రాంతాల్లో గజం స్థలం రూ.50 వేలు ఉండగా.. విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాలయాల సమీపంలో, కోర్‌ క్యాపిటల్లో గజం స్థలం రూ.70 వేలు పలుకుతోంది. దళారులు తప్పుడు ప్రచారాలతో ఆ భూములను 40, 50 వేలకే కాజేస్తున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకే లే అవుట్‌, ఒకే సర్వే నెంబరులో ప్లాట్లు వచ్చిన సాధారణ, అసైన్డ్‌ రైతుల ప్లాట్ల ధరల్లో రూ.10 నుంచి 20 వేలు తేడా కనిపిస్తోంది. ఇలా తొలుత అసైన్డ్‌ రైతుల ప్లాట్ల ధరలు తగ్గించి, ఆ ధరను చూపి సాధారణ రైతుల ప్లాట్ల ధరలను కూడా తగ్గించేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ వైపు నుంచి రిటర్నబుల్‌ ప్లాట్లపై స్పష్టమైన ప్రకటన రావాలని రైతులు కోరుతున్నారు. తద్వారా గందరగోళం తొలగిపోతుందని, దళారుల ఆట సాగదని రైతు నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



సీఆర్డీఏ స్పందించాలి..

రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం గజం భూమి ధర రూ.50 నుంచి 70 వేల వరకూ పలుకుతోంది. కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం, మందడం ప్రాంతాల్లో గజం స్థలం రూ.50 వేలు ఉండగా.. విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాలయాల సమీపంలో, కోర్‌ క్యాపిటల్లో గజం స్థలం రూ.70 వేలు పలుకుతోంది. దళారులు తప్పుడు ప్రచారాలతో ఆ భూములను 40, 50 వేలకే కాజేస్తున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకే లే అవుట్‌, ఒకే సర్వే నెంబరులో ప్లాట్లు వచ్చిన సాధారణ, అసైన్డ్‌ రైతుల ప్లాట్ల ధరల్లో రూ.10 నుంచి 20 వేలు తేడా కనిపిస్తోంది. ఇలా తొలుత అసైన్డ్‌ రైతుల ప్లాట్ల ధరలు తగ్గించి, ఆ ధరను చూపి సాధారణ రైతుల ప్లాట్ల ధరలను కూడా తగ్గించేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ వైపు నుంచి రిటర్నబుల్‌ ప్లాట్లపై స్పష్టమైన ప్రకటన రావాలని రైతులు కోరుతున్నారు. తద్వారా గందరగోళం తొలగిపోతుందని, దళారుల ఆట సాగదని రైతు నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:44 AM