Share News

Operation Kunki Success: కుంకీ ఆపరేషన్‌ సక్సెస్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:44 AM

రాష్ట్రంలో ఆపరేషన్‌ కుంకీ మొదలైంది. కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగులతో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయవంతమైంది.

Operation Kunki Success: కుంకీ ఆపరేషన్‌ సక్సెస్‌

  • మొగిలిలో 15 రోజులుగా ఏనుగుల సంచారం

  • వాటిని తరిమి దారిమళ్లించిన కుంకీలు

  • అధికారులకు డిప్యూటీ సీఎం అభినందనలు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ కుంకీ’ మొదలైంది. కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగులతో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీలు దారి మళ్లించి, అడవుల్లోకి తరిమికొట్టాయి. కృష్ణ, జయంత్‌, వినాయక అనే పేరు గల కుంకీలు అటవీ ఏనుగులు పంటల వైపు రాకుండా అడ్డుకున్నాయి. మొగిలి గ్రా మ ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉంద నే సమాచారంతో అధికారులు కుంకీ ఆపరేషన్‌ నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వర కూ సాగిన ఈ ఆపరేషన్‌లో కృష్ణ అనే కుంకీ చాలా చురు గ్గా పాల్గొందని అటవీశాఖ అధికారులు సోమవారం తెలిపారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చాక రెండు నెలల శిక్షణ అనంతరం ఈ ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్‌ భరోసా ఇస్తుందన్నారు. ఏనుగుల గుంపుల బారి నుంచి పంటలు, ప్రజల ప్రాణాలను కాపా డే దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్ర భుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని, ఈక్రమంలో కుంకీలతో చేపట్టిన తొలి ప్రయత్నం ఫలించడానికి కృషి చేసిన మావటీలు, అటవీ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. అడగ్గానే కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అటవీమంత్రి ఈశ్వర్‌ ఖండ్రేకు పవన్‌ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి ఆపరేషన్‌ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపడతామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:44 AM