యానాం అభివృద్ధికి సహకారం అందిస్తా: సీఎం
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:13 AM
యానాం ప్రజలపై ఉన్న అభిమానంతోనే రోడ్డు మార్గంలో ఇంత దూరం వచ్చానని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి అన్నారు.

పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి
యానాం ప్రజా ఉత్సవాలు ప్రారంభం
యానాం, జనవరి 6: యానాం ప్రజలపై ఉన్న అభిమానంతోనే రోడ్డు మార్గంలో ఇంత దూరం వచ్చానని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి అన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వ ర్యంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఉత్సవాల కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రంగసామి పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ సేల్వం, మత్స్యశాఖమంత్రి లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి జైకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి తిరుమురుగన్, డిప్యూటి స్పీకర్ రాజవేలు, ఎమ్మెల్యేలు ఏకేడీ అర్ముగం, లక్ష్మీకాంత్, ప్రకాష్, భాస్కర్, పరిపాలనాధికారి మునిస్వామి, వ్యవసాయశాఖ డీడీ జె.శివశుభ్రమణియన్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం రంగసామి మాట్లాడారు. సామా న్య ప్రజలకు ఏదోఒకటి చేయాలన్నదే నా తపన అన్నారు. నేను యానానికి ఏమీ చేసానన్నది యానాంలో అభివృద్ధి పనుల శిలఫలకాలను చూస్తే అర్ధమవుతుందన్నారు. పుదుచ్చేరి, కారైకాల్, మహే, యానాంలోని అన్నిప్రాంతాలు నాకు సమానమేనన్నారు. ఢిల్లీ ప్రతినిధి మల్లా డి కృష్ణారావు తీసుకువచ్చిన ఎంత కఠినమైన సమస్యలైనా నెరవేర్చి తీరుస్తున్నాన్నారు. యా నాం వేంకటేశ్వరస్వామి ఆలయ త్రీడీ నమూనా వీడియో చూసిన వెంటనే చాలా ఆనందం కలిగిందన్నారు. యానాం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, యానానికి మరింత అభివృద్ధికి తగిన సహకారం అందిస్తానన్నారు.
పుష్కరాలకు రూ.10కోట్లు ఇవ్వండి
సీఎంను కోరిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి
యానాం, జనవరి 6: వచ్చే పుష్కరాలకు పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి రూ.10కోట్లు కేటాయించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. యానాం ప్రజా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముఖ్యంగా యానానికి నాలుగేళ్లుగా సీఎం రంగసామి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పరిష్కరించాలని కోరారు. 2012లో పుష్కరాలు యానాంలో ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. యానాంలో వెంకన్న ఆలయం నిర్మాణానికి టీటీడీ రూ.3కోట్లు కేటాయించిందని, మిగిలిన పనులు దాతల సహకారంతో రూ.4కోట్లతో చేప డతామన్నారు. రెండోవిడతలో రూ.8కోట్లు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం రూ.3కోట్లు ఇస్తే, మిగిలిన రూ.5కోట్లు దాతల నుంచి సేకరి స్తామ న్నారు. మల్లాడి పత్రాన్ని సీఎం, మంత్రులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడారు. పుదుచ్చేరి నుంచి వచ్చిన సీఎం, ఇతర మంత్రులకు అభినందనలు తెలిపారు. తాను కూడా పుదుచ్చేరి నుంచి వచ్చిన అతిథిలా ఉన్నానని, తాను సభ అధ్యక్షుడిని అనేవిషయం ఇప్పటివరకుతెలియదన్నారు. అతిథులను గౌరవించుకోవాలి, ఇంకా మాట్లాడాల్సిన అంశాలను ఇతర వేదికలపై మాట్లాడతా నని, తాను యానాం ప్రజలకు ఇచ్చిన హామీ లను సీఎం అమలుచేయాలని కోరారు.