Share News

యానాం బీచ్‌కు పర్యాటకుల తాకిడి

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:20 AM

సం క్రాంతి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి వారాంతపు సెలవులు కూడా కలసి రావడం ఎక్కువమంది ఇంకా తిరుగు ప్రయా ణాలను ఆదివారం వరకు వాయిదా వేసుకు న్నారు.

యానాం బీచ్‌కు పర్యాటకుల తాకిడి

యానాం, జనవరి17 (ఆంధ్రజ్యోతి): సం క్రాంతి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి వారాంతపు సెలవులు కూడా కలసి రావడం ఎక్కువమంది ఇంకా తిరుగు ప్రయా ణాలను ఆదివారం వరకు వాయిదా వేసుకు న్నారు. పండుగ ముగిసిన తర్వాత ఆలయా లు, బీచ్‌లు, ఇతర టూరింగ్‌ స్పాట్లను సంద ర్శిస్తున్నారు. ఇందులో భాగంగా యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్‌కు పర్యాటకుల సందడి గట్టిగానే తగిలింది. సంక్రాంతి పండుగ రోజు ల్లో యానాం పర్యాటకశాఖ ఆఽధీనంలోని సీగల్స్‌ రెస్టారెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బో టింగ్‌ ద్వారా వృద్ధ గౌతమి గోదావరి నదిలో పర్యాటకులు బోటు షికారుచేశారు. అలాగే బొటానికల్‌ గార్డెన్‌కూ పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చారు. బీచ్‌లో జీసస్‌మౌంట్‌, భారతమాత విగ్రహం, రాజీవ్‌గాంధీపార్కు, శివం హోలీబాత్‌లను పర్యాటకులు సందర్శించారు.

Updated Date - Jan 18 , 2025 | 12:20 AM