మహిళా చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:12 AM
మహిళలు పని/ఉద్యోగం చేసే ప్రదేశాల్లో లైం గిక వేధింపుల నిరోధానికి ఉన్న చట్టాలపై వా రికి పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలక్ష్మీ, ఎస్పీ డి.నరసింహ కిశోర్ పేర్కొన్నారు.

అవగాహన సదస్సులో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎస్పీ నరసింహ కిశోర్
రాజమహేంద్రవరం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మహిళలు పని/ఉద్యోగం చేసే ప్రదేశాల్లో లైం గిక వేధింపుల నిరోధానికి ఉన్న చట్టాలపై వా రికి పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలక్ష్మీ, ఎస్పీ డి.నరసింహ కిశోర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా చట్టా లపై అవగాహనా సదస్సు నిర్వహిం చారు. న్యాయ సేవాధికార సంస్థ సేవల గురించి మహిళలకు వివ రించాలని మహి ళా రక్షక్ సిబ్బం దికి సూచించారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను వారికి వివరించడం, బాధిత మహిళలకు అండగా నిలవడం వంటి బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎస్పీ కిషోర్ అన్నారు. రాష్ట్రంలోను, దేశంలోను ఎన్ని చట్టాలు అమలులో ఉన్నా ఆశించిన స్థాయిలో మహిళలకు ఉపయుక్తం కాకపోవడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. కార్యక్ర మంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి కె.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.