Share News

గీత..మార్చెను!

ABN , Publish Date - Jan 26 , 2025 | 01:15 AM

తెలుగుదేశం నాయకత్వంలో కూట మి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా గీత కులాలకు మద్యం షాపులు కేటాయించింది.

గీత..మార్చెను!

10 శాతం మద్యం దుకాణాలు

13 మండలాలకు కేటాయింపు

మండలంలో రూ.32.5 లక్షలు

కార్పొరేషన్‌లో రూ.42.5 లక్షలు

శెట్టిబలిజలకు 11 షాపులు

గౌడ కులస్తులకు ఒకటి

గౌడ్‌ కులస్తులకు మరొకటి

ఆయా వర్గీయుల ఆనందం

20 శాతం ఇవ్వాలని డిమాండ్‌

రాజమహేంద్రవరం, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి) : తెలుగుదేశం నాయకత్వంలో కూట మి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా గీత కులాలకు మద్యం షాపులు కేటాయించింది. 10 శాతం షాపు లను ఇచ్చింది.ఆయా ప్రాంతాల్లో ఉన్న గీత కులాల్లోని ఉపకులాల వారీ కేటాయిం పు లు జరిగాయి. చరిత్రలో ఏనాడూ లేని విధంగా సగం రాయతీతో గీత కులాలకు మద్యం షాపులు కేటాయించడం పట్ల ఆ యా వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో శనివారం కలె క్టర్‌ పి.ప్రశాంతి, జేసీ ఎస్‌.చిన్నరాముడు ఆధ్వర్యంలో మండలాల వారీ లాటరీ తీసి, షాపులు కేటాయించినట్టు జిల్లా ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ లావణ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ఈ దుకా ణాలు కేటాయించారు. రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, బిక్కవోలు, చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కడియం, కోరుకొండ, పెరవలి, రంగంపేట, సీతాన గ రం, తాళ్లపూడి మండలాల పరిధిలో ఒక్కొ క్క మద్యం దుకాణం వంతున గీత కులా ల్లో ఒక కులమైన శెట్టిబలిజలకు కేటాయిం చారు. అనపర్తిలో గౌడ్‌ కులానికి 1, నిడద వోలు రూరల్‌లో గౌడ కులానికి 1 కేటాయి ంచారు. మండలాల్లో దుకాణానికి రూ. 32.5 లక్షలు,రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరి ధిలో 42.5 లక్షలు చెల్లించాల్సి ఉం టుం ది.ఇతరులు గతంలో వీటికి రెట్టింపు ఫీజు చెల్లించారు. అప్లికేషన్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలి. ప్రభుత్వం దుకాణాలను గెజిట్‌ రూపంలో ప్రకటించనుంది.ఈ ప్రకటన వ చ్చిన వెంటనే దుకాణాలు మొదలు పెట్టు కోవచ్చని అధికారులు తెలిపారు.రాజమ హేంద్రవరం గౌడ-శెట్టిబలిజ సంఘం గౌర వాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్‌ ప్రభుత్వ నిర్ణ యంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల ముందు కూటమి 20 శాతం షాపులు గీత కులాలకు కేటాయిస్తానని,ఇవాళ 10 శాతమే కేటాయించిందన్నారు.ఈ షాపులను వ్యక్తులకు కాకుండా గీత కార్మికుల సొసైటీ లకు కేటాయిం చాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 26 , 2025 | 01:15 AM