నష్టాలు..ఫుల్!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:23 AM
జిల్లాలో మద్యం అమ్మకాలు మగతగా సాగు తున్నాయి. అటు మద్యపాన ప్రియుల సంఖ్య తగ్గలేదు. ఇటు మద్యం డిపోలో నాణ్యమైన స రుకు ఫుల్‌గా ఉంది.అయినా ప్రభుత్య ఖజానాకు రాబడిలో మాత్రం గండి పడుతోంది.

దుకాణాల్లో 200 రకాల బ్రాండ్లు
డిపోలో లక్ష కేసులు నిల్వ
అమ్మకాల్లో మాత్రం నీరసం
ప్రభుత్వ ఖజానాకు గండి
పెరిగిన సారా తయారీ
పట్టించుకోని ఎక్సయిజ్ శాఖ
కమీషన్ పెంపుతో కాస్త ఊరట
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మద్యం అమ్మకాలు మగతగా సాగు తున్నాయి. అటు మద్యపాన ప్రియుల సంఖ్య తగ్గలేదు. ఇటు మద్యం డిపోలో నాణ్యమైన స రుకు ఫుల్‌గా ఉంది.అయినా ప్రభుత్య ఖజానాకు రాబడిలో మాత్రం గండి పడుతోంది. అమ్మకాల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. కూ టమిప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అందు బాటులోకి వచ్చింది.పైగా అధిక ధరలకూ కళ్లెం పడింది. అయితే ఇప్పుడు మద్యం అమ్మకాల్లో చిత్రమైన పరిస్థితి కానవస్తోంది. నాణ్యమైన సరుకు ఫుల్లుగా అందుబాటులో ఉన్నా అమ్మ కాలు నీరసంగా జరుగుతున్నాయి.లాభాలు అ టుంచితే నష్టాలను మూటగట్టుకుంటున్నామం టూ మద్యం వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పు డు కూటమి ప్రభుత్వం కమీ షన్‌ని 14 శాతా నికి పెంచడానికి ఆంగీకరించినా మద్యం అమ్మ కాలు ఇలాగే నీరసంగా ఉంటే ఫలితం ఉండక పోవచ్చనే వాదన వినవస్తోంది.జిల్లాలో స్థిమితం లేని మద్యం అమ్మకాలపై ప్రత్యేక కథనం.
సరుకు ఫుల్..అమ్మకాలు నిల్
వైసీపీ హయాంలో జగన్ పిచ్చి మందు అం దుబాటులో ఉండేది. కూటమి ప్రభుత్వంలో టిన్ బీర్లతో సహా దాదాపు 200 రకాల బ్రాం డ్ల సరుకు వస్తోంది.ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నిండా మద్యం ఉంది. కానీ అమ్మకాలు మా త్రం పడిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం రోజుకు రూ.2 కోట్ల మేర అమ్మకాలు ఉంటే..ఇప్పుడు 200 రకాల బ్రాం డ్లు అందుబాటులో ఉన్నా అంతే విక్ర యా లు ఉండడం గమనార్హం.రాజమహేంద్రవ రం డిపోలో సుమారు లక్ష కేసుల వరకూ నిల్వ ఉండగా.. రోజుకు సరాసరిన 5 వేల కేసులు మాత్రమే వెళుతోంది. సరిగా అమ్మ కాలు లేక దుకాణదారులు ఆచితూచి ఇండె ంట్ పెడుతున్నారు.కూటమి ప్రభుత్వం చీఫ్ లిక్కర్ రూ.99 చేయగా.. ఎక్కువగా అమ్ముడ య్యే బ్రాండ్ల ధరలు నేలకు దించింది.
పూటుగా సారా!
ప్రైవేటు బాంద్రీ షాపుల కేటాయింపులో మండల కేంద్రాలను మాత్రమే యూనిట్‌గా తీ సుకున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం దుకా ణాలు లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా నగరాలు, గ్రామాలు తేడా లేకుండా సారా పూటుగా దొరుకుతోంది. దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టు,గోదావరి లంకల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారాను గుట్టు చప్పుడు కాకుండా తయారుచేసి పట్టణాలు, పల్లెలకు తరలిస్తున్నారు. ఉదాహరణకు జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలో సీటీఆర్‌ఐ పనస చెట్టు సెంటర్, క్వారీ మార్కెట్ అన్న క్యాంటీన్ సమీపంలో పగలూ రాత్రీ తేడా లేకుండా సారా అమ్ముతున్నా ఎక్సయిజ్ అధికారులకు మాత్రం ‘ఎందుకనో’ వాసన రావడం లేదు. దీంతో ప్రభుత్వం రూ.99కే నాణ్యమైనా చీఫ్ లిక్కర్ ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఏదేమైనా అటు జనాల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు సారా వల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ వల్లే సర్కారు ఆదాయానికి చిల్లు పడుతోందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
బార్లలోనూ ఎంఆర్‌పీ!
బార్ల అమ్మకాల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు రోజుకు రూ.2లక్షల విక్రయాలు జరిగే బార్‌లో ఇప్పుడు రూ.50వేలు దాటడం కష్టమవుతోంది. బార్‌ల యజమానులు ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ప్రభు త్వానికి (గత ప్రభుత్వం) లైసెన్సు ఫీజును కట్టేశారు. దీంతో అప్పటి వరకూ పర్మిట్ రూమ్‌లు ఇవ్వ కూడదని బార్‌ల యజమానులు ఎక్సైజ్ శాఖను కోరారు. కొత్త మద్యం పాలసీలో భాగ ంగా ఆ అంశంపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా స్పందిం చింది. తీరా ప్రైవేటు మద్యం షాపులు వచ్చాక తీరు మారిపోయింది. ముఖ్యంగా మద్యం షాపు లకు పర్మిట్ రూమ్‌లు లేకపో యినా అనధి కారికంగా అమలు చేస్తున్నారు. మద్యం షాపుల వద్దే బహిరంగంగా మద్యం సేవిస్తున్నా ఎక్సైజ్ అధికారులకు కానరావడం లేదు.దీంతో బార్లలో సేల్స్ పడిపోయింది. రోజూ నష్టాలు చూసే బదులు బార్‌లకు తాళాలు వేసి ఎక్సైజ్ సూప రింటెండెంట్‌కి ఇచ్చేద్దామనే ఆలోచన చేసిన బార్‌ల యజమానులు.. ప్రభుత్వం కమిషన్‌ని సవరించడంతో తాము కూడా ఎంఆర్‌పీ ధర లకు అమ్మడానికి సిద్ధపడుతున్నారు.