Share News

గీతకూ.. ఫుల్‌గా!

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:27 AM

మద్యం షాపులకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు..ఇప్పటికే మద్యం షాపులు పాడుకున్న వారు లాభాలు రావడంలేదని లబోదిబో మం టున్నా గీత కార్మికులు వెనక్కు తగ్గలేదు. జి ల్లాలో గీతకులాలకు ప్రభుత్వం కేటా యించిన 13 షాపులకు ఏకంగా 387 దరఖాస్తులు వచ్చాయి.

గీతకూ.. ఫుల్‌గా!
గీత కార్మికుడు

నిడదవోలులో అత్యధికం

అనపర్తిలో అత్యల్పం

లైసెన్స్‌ ఫీజులో రాయితీ

దుకాణాలకు డిమాండ్‌

ఎన్నికల కోడ్‌..లాటరీ వాయిదా

గీత కార్మికుల్లో తీవ్ర నిరాశ

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

మద్యం షాపులకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు..ఇప్పటికే మద్యం షాపులు పాడుకున్న వారు లాభాలు రావడంలేదని లబోదిబో మం టున్నా గీత కార్మికులు వెనక్కు తగ్గలేదు. జి ల్లాలో గీతకులాలకు ప్రభుత్వం కేటా యించిన 13 షాపులకు ఏకంగా 387 దరఖాస్తులు వచ్చాయి. కానీ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమ లులో ఉన్నందున వాటికి లాటరీ తీయడం వాయిదా పడింది.గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 8వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించారు. రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ కార్యాల యం లో సోమవారం ఈ దరఖాస్తులకు లాటరీ తీ సి షాపులు కేటాయించాల్సి ఉంది.ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా వేసినట్టు ఎక్సయిజ్‌ సూప రింటెండెంట్‌ లావణ్య ప్రకటించారు.దీంతో దర ఖాస్తుదారుల్లో నిరూత్సాహం ఏర్పడింది.

హామీ నెరవేర్చిన కూటమి..

తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కులాలకు 10 శాతం మద్యం దుకాణాలను కేటాయిస్తామని సార్వత్రిక ఎన్నికల మేని ఫెస్టో లో ప్రకటించింది.ఆ హామీ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా జిల్లాలో 13 షాపులు వచ్చా యి.అందులో గీతకులాలకు చెందిన శెట్టిబలిజలకు 11, గౌడ-1, గౌడ్‌-1 వచ్చాయి. షాపుల కేటాయింపునకు రాజమహేంద్రవరం సిటీతో పాటు, పలు మండలాలను గుర్తించారు.

నిడదవోలులో 48 దరఖాస్తులు

ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇవ్వడంతో పోటీ పెరిగింది.రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలో సాధారణంగా అయితే ఒక్కో దుకా ణానికి ఏడాదికి 93.75 లక్షలు చెల్లించాలి. కానీ గీత కులాలకు కేటాయించిన షాపునకు 50 శాతం రాయతీ ఇవ్వడం వల్ల 46.75 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. మండలాల్లో సాధారణం గా 76.5 లక్షలు చెల్లించాలి. గీతకులాలు మాత్రం రూ.35.75 లక్షలు చెల్లిస్తే సరిపో తుంది.దీంతో జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి. నిడదవోలు మండలంలోని గౌడ సామాజిక వర్గానికి కేటా యించిన దుకాణానికి ఏకంగా 48 దరఖాస్తులు వచ్చాయి. అనపర్తిలో గౌడ్‌ కులానికి కేటా యించిన షాపునకు మాత్రం 9 దరఖాస్తులే వచ్చాయి. సీతానగరం,చాగల్లు, గోపాలపురం మండలాల్లో శెట్టిబలిజలకు కేటాయించిన దుకా ణాలకు ఒక్కో చోట 43 వంతున దరఖాస్తులు వచ్చాయి. దేవరపల్లి, పెరవలి మండలాల్లో శెట్టిబలిజలకు కేటాయించిన షాపులకు 39 వంతున దరఖాస్తులు వచ్చాయి. రాజమహేం ద్రవరంలో షాపునకు 22, కడియం 22, కోరుకొండ 26, రంగంపేట 13, బిక్కవోలు 14, తాళ్లపూడి 26 దరఖాస్తులు వచ్చాయి.

ఎన్నికల కమిషన్‌ చేతుల్లో..

గీత కులాలకు సోమవారం కేటాయించాల్సి న మద్యం షాపులు ఎన్నికల కోడ్‌ వల్ల వాయిదాపడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరనుంది.వాస్తవానికి ఈ షాపుల కేటాయింపు ఎన్నికల కోడ్‌ కంటే ముందుగానే జరిగింది.దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ముందుగానే ఆరంభించారు. దీని వల్ల లాటరీ వేసి ఈ షాపులను లబ్ధి దారులకు కేటాయించేందుకు అనుమతివ్వా లని ప్రభుత్వం కోరుతున్నట్టు సమా చారం. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే వెంటనే లాటరీ వేసి ఈ షాపులను అప్పగించే అవ కాశం ఉంది. లేదంటే మార్చి నెల 8వ తేదీ తర్వాతే షాపులు కేటాయిస్తారు.

ఆదాయం రూ.7.74 కోట్లు

గీతకులాలకు కేటాయించిన 13 షాపులకు 387 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దర ఖాస్తుకు రూ.2 లక్షలు లైసెన్స్‌ ఫీజు చెల్లిం చారు.అంటే మొత్తం రూ.7.74 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.13 షాపులకు ప్రభు త్వానికి ఆయా లైసెన్స్‌దారులు రూ.4 కోట్ల, 75 లక్షల 75 వేలు ఏడాదికి చెల్లించాలి. గతేడాది అక్టోబరు నుంచి ఈ మద్యం కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది.షాపులకు రెండేళ్ల పాటు లైసెన్స్‌ ఉంటుంది.కానీ ఈ షాపులకు వచ్చే నెలలో లైసెన్స్‌దార్లకు వస్తే సెప్టెంబరుకు ఒక ఏడాది పూర్తవుతుంది.అక్కడ నుంచి 2026 సెప్టెంబరు వరకూ మరో ఏడాది ఉంటుంది.

=============================

Updated Date - Feb 10 , 2025 | 12:27 AM