Share News

హెల్మెట్‌ ధరించడం భారం కాదు బాధ్యత

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:42 AM

హెల్మెట్‌ ధరించడం భారంగా కాకుం డా బాధ్యతగా భావించాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌బీఎం.మురళీకృష్ణ అన్నారు. జిల్లా పోలీస్‌, జిల్లా రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహకిశోర్‌ ఆదేశాల మేరకు మహిళా పోలీసులు, సిబ్బంది కలిపి గురువారం హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

 హెల్మెట్‌ ధరించడం భారం కాదు బాధ్యత
హెల్మెట్‌ ధారణపై అవగాహన కలిగిస్తున్న పోలీసులు

  • రహదారి భద్రత మాసోత్సవ ర్యాలీలో అడిషనల్‌ ఎస్పీ మురళీకృష్ణ

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 30 (ఆం ధ్రజ్యోతి): హెల్మెట్‌ ధరించడం భారంగా కాకుం డా బాధ్యతగా భావించాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌బీఎం.మురళీకృష్ణ అన్నారు. జిల్లా పోలీస్‌, జిల్లా రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహకిశోర్‌ ఆదేశాల మేరకు మహిళా పోలీసులు, సిబ్బంది కలిపి గురువారం హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీకి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద అడిషనల్‌ ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ సురేష్‌ బాబు జెండా ఊపి ప్రారంభించారు.ర్యాలీ నగరంలో జెఎన్‌ రోడ్డు, రామా లయం సెంటర్‌, ముగ్గుపేట సెంటర్‌, అజాద్‌చౌక్‌, దేవిచౌక్‌ సెంటర్‌, కంబాలచెరువు మీదు గా చిరంజీవి బస్టాండ్‌ వరకు సాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. బైక్‌లు, స్కూటీలపై హెల్మెట్‌ లేకుండా వెళ్లేవారిని ఆపి వారికి మరాద్యగా గులాబి ఇచ్చి హెల్మెట్‌ ఆవ శ్యకతను వివరించారు.హెల్మెట్‌ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. కార్యక్రమం లో ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్‌బీ సీఐ ఏ.శ్రీ నివాసరావు, ట్రాఫిక్‌ సీఐ-1 నబీ, సీఐ-2 సీహెచ్‌ సూరిబాబు, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ కె.మం గాదేవి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:42 AM