Share News

గోదావరి అల్లుడా..మజాకానా!

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:46 AM

గోదావరి జిల్లాల అల్లుడంటే మజాకానా.. మూడు రోజులు విందు ఆహా అనిపించాలే.. అంతా చెప్పుకోవాలే.. అంతలా ఉంటుంది మరి అతిథ్యం.. ఎక్కడా తగ్గరు.. వద్దన్నా వినరు.. విందు అదిరిపోవాల్సిందే..

గోదావరి అల్లుడా..మజాకానా!
207 రకాల పిండి వంటలు

గోదావరి జిల్లాల అల్లుడంటే మజాకానా.. మూడు రోజులు విందు ఆహా అనిపించాలే.. అంతా చెప్పుకోవాలే.. అంతలా ఉంటుంది మరి అతిథ్యం.. ఎక్కడా తగ్గరు.. వద్దన్నా వినరు.. విందు అదిరిపోవాల్సిందే.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గుడివాడ గోపాల్‌ శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె శైలేఖకి ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన జల్లిపల్లి విశ్వేశ్వరరావు రోజా దంపతుల కుమారుడు సాయికి గత ఆగస్టు నెలలో వివాహం జరిగింది. తొలిసారి సంక్రాంతి పండుగకు అత్తారింట్లో అడుగుపెట్టడంతో గత రెండు రోజులుగా విందుతో అదరగొట్టేశారు.. చివరి రోజు కొత్త అల్లుడి కి 207 రకాల పిండివంటలను తయారుచేసి బంధువుల సమక్షంలో ప్రత్యేకంగా వడ్డించారు.. నూతన వధూవరులు ఆనందం వ్యక్తంచేశారు.. ఒక స్వీట్‌ రుచి చూశారు.. మిగిలినవి బంధువులకు పంచిపెట్టారు.. - గోపాలపురం

Updated Date - Jan 17 , 2025 | 12:46 AM