నాడు అధ్వానం.. నేడు అందంగా..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:18 AM
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రహ దారులు అధ్వానంగా ఉండడంతో వాహన దారులతోపాటు స్థానిక ప్రజానీకం సైతం తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

పి.గన్నవరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రహ దారులు అధ్వానంగా ఉండడంతో వాహన దారులతోపాటు స్థానిక ప్రజానీకం సైతం తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో తొలుత పుంత రోడ్లకు సైతం మోక్షం వచ్చింది. అలా గే గ్రామ ప్రధాన రహదారులూ మెరుగుప డ్డాయి. పి.గన్నవరం రహదారిపై ప్రయాణం చేయడానికి ప్రజానీకం అవస్థపడేవారు. కానీ ప్రస్తుతం నాడు అధ్వానంగా ఉన్న రహదా రిని కొత్తగా వేయడంతో నేడు అద్దంలా మెరి సిపోతోంది. రహదారుల అభివృద్ధి జరగడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.