అనపర్తిలో అంబరాన్నంటేలా...
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:57 AM
అనపర్తి, జనవరి 15 (ఆంధజ్యోతి): కోరిన కోర్కెలు తేర్చే కల్పవల్లిగా భక్తుల పూజలందుకుంటున్న అనపర్తి గ్రామ దేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి అంబరాన్నంటింది. సంక్రాంతి రోజు రాత్రి అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రాత్రి 8 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులకు ఆలయ కమిటీ ప్రతినిధులు సత్తి వెంకటరామారెడ్డి, పడాల కళ్యాణ్‌రెడ్డి స్వా

వైభవంగా వీరుళ్లమ్మ జాతర
అమ్మవారిని దర్శించుకున్న
లక్ష మందికి పైగా భక్తులు
ఆకట్టుకున్న సాంస్కృతిక
కార్యక్రమాలు, బాణసంచా
అనపర్తి, జనవరి 15 (ఆంధజ్యోతి): కోరిన కోర్కెలు తేర్చే కల్పవల్లిగా భక్తుల పూజలందుకుంటున్న అనపర్తి గ్రామ దేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి అంబరాన్నంటింది. సంక్రాంతి రోజు రాత్రి అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రాత్రి 8 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులకు ఆలయ కమిటీ ప్రతినిధులు సత్తి వెంకటరామారెడ్డి, పడాల కళ్యాణ్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంత రం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న గరగను తలకెత్తుకుని ఎమ్మెల్యే జాతర ఉత్సవాలను ప్రారంభించారు. సుమారు లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీచౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గరగ నృత్యాలతో బాటు, వివిధ ఆర్కెస్ట్రాలు, కోయ మేళాలు వంటి వి ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కళాకారులు ఆక ట్టుకున్నారు. అదేవిధంగా బాణసంచా కాల్పుల పోటీలు భక్తులకు కనువిందు చేశాయి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ పేరుతో ఏర్పాటు చేసిన కొలంబస్, జెయింట్ వీల్, చిన్నారులకు బోటింగ్ వం టి అంశాలు ఆకట్టుకున్నాయి. బుధవారం అమ్మ వారి తీర్థ మహోత్సవం సందర్భంగా అధిక సం ఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీర సారెలతో మొక్కులు చెల్లించుకున్నారు. జాతర లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఐ సుమంత్, ఎస్‌ఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, చింతా ప్రకాశరెడ్డి, బెండమూరి రాజు, ఒంటిమి సూర్యప్రకాష్ తదితరులున్నారు.