నేటి నుంచి వాలీబాల్ టోర్నమెంటు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:46 AM
ఉప్పలగుప్తం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అరిగెల శ్రీరంగయ్య నేషనల్ వాలీబాల్ పోటీలకు కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణం ముస్తాబయ్యింది. ఈ నెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు టోర్నమెంటు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఆరు పురుషుల, మూడు మహిళా టీమ్‌లు పాల్గొన నున్నాయ. 1988 నుంచి వాలీబాల్ పోటీల నిర్వహణలో అంచెలంచెలు

ముస్తాబైన గొల్లవిల్లి క్రీడాప్రాంగణం ఫ ఫ్లడ్ లైట్లవెలుగుల్లో మ్యాచ్‌లు
ఎనిమిది రాష్ట్రాల నుంచి ఆరు పురుషులు, మూడు మహిళా టీమ్‌లు రాక
ఉప్పలగుప్తం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అరిగెల శ్రీరంగయ్య నేషనల్ వాలీబాల్ పోటీలకు కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణం ముస్తాబయ్యింది. ఈ నెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు టోర్నమెంటు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఆరు పురుషుల, మూడు మహిళా టీమ్‌లు పాల్గొన నున్నాయ. 1988 నుంచి వాలీబాల్ పోటీల నిర్వహణలో అంచెలంచెలుగా ఎదిగిన గొల్లవిల్లి వాలీబాల్ క్రీడా మైదానం జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రశంసలు అందుకుంది. ఆటగాళ్ల ప్రాక్టీసు నిమిత్తం ప్రత్యేక కోర్టును గతంలోనే ఏర్పాటు చేశారు. ఇప్పటికే గొల్లవిల్లి వాలీబాల్ కోర్టును రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ పరిశీలించడం జరిగింది. నాలుగు వేల మంది ప్రేక్షకులకు సరిపడే గ్యాలరీలు నిర్మించారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీ నిర్మించారు. వీఐపీలకు ప్రత్యేక వేదిక ఉంది. వాహనాలకు రెండు చోట్ల పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్‌ఐ సీహెచ్ రాజేష్ క్రీడా ప్రాంగణానికి రాకపోకలకు ప్రత్యేక మార్గాలను నిర్దేశిస్తూ రూట్ మ్యాప్ రూపొందించారు. క్రీడాప్రాంగణంలో శాంతిభద్రతల ఏర్పాట్లపై టోర్నమెంటు ముఖ్య సలహాదారు అరిగెల నానాజీ, సాంకేతిక సలహాదారు వుండ్రు రాజబాబుతో చర్చించారు.
యువత చెమటోడుస్తున్నారు
టోర్నమెంటు అధ్యక్షుడు, దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ
గొల్లవిల్లి వాలీబాల్ క్రీడా వేదిక వెలుగులు నలుమూలలా ప్రసరింప చెయ్యాలన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సహకారంతో అరిగెల శ్రీరంగయ్య నేషనల్ టోర్నమెంటును ప్రారంభించాం. గొల్లవిల్లి వాలీబాల్ క్లబ్ యువతతో పాటు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి యువత ఈ టోర్నమెంటు నిర్వహణకు చెమటోడుస్తున్నారు.
తృతీయస్థానంలో గొల్లవిల్లి
గొలకోటి ఫణీంద్రకుమార్, పీడీ, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి
నేషనల్ వాలీబాల్ టోర్నమెంటు నిర్వహణలో గొల్లవిల్లి క్రీడా వేదిక ప్రస్తుతం దేశంలో మూడవ స్థానంలో ఉంది. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో గొల్లవిల్లి టోర్నమెంటు రిజిస్ట్రేషన్ జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగే పోటీలు లీగ్ పద్ధతిలో జరుగుతాయి.