Share News

వాడపల్లికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:00 AM

ఆత్రేయపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను, శాస్రోక్తంగా నిర్వహించి స్వామిని వివిధ రకాల పుష్పాల

వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహిస్తున్న భక్తులు

ఆత్రేయపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను, శాస్రోక్తంగా నిర్వహించి స్వామిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తీరువీధులలో ఏడు ప్రదక్షిణలు నిర్వ హించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తులభారాలు, కానుకులు సమర్పించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా రూ.28,76,811 ఆదాయం లభించినట్టు ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలలో వేచి ఉన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం రాత్రి సత్యశ్రావణి నృత్యనికేతన్‌ వారిచే అందించిన ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

శృంగారవల్లభస్వామి ఆలయంలో....

పెద్దాపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని భక్తులు శనివారం దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కె ట్ల విక్రయం ద్వారా రూ.82,960, అన్నదాన విరాళాలు రూ.59,975, కేశఖండన ద్వారా రూ.2,320, తు లాభారం, కానుకలు ద్వారా రూ.400, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.15,975 వెరసి రూ.1,61,556 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 01:00 AM