ఫైర్‌స్టేషన్లు వస్తున్నాయ్!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:53 AM
ఎన్నాళ్ల నిరీక్షణో.. ఎప్పటి కలో.. త్వరలో తీర నుంది. జిల్లాకు మరో రెండు ఫైర్ స్టేషన్లు అం దుబాటులోకి రానున్నాయి.

ఫలించిన ఎదురుచూపులు
ఒక్కో స్టేషన్‌కు రూ.2.85 కోట్లు
దేవరపల్లిలో ఒకటి.. బొమ్మూరులో మరొకటి నిర్మాణం
నాడు పట్టించుకోని వైసీపీ
కూటమి ప్రభుత్వంలో కదలిక
ఎమ్మెల్యేలు చొరవ చూపాలి
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఎన్నాళ్ల నిరీక్షణో.. ఎప్పటి కలో.. త్వరలో తీర నుంది. జిల్లాకు మరో రెండు ఫైర్ స్టేషన్లు అం దుబాటులోకి రానున్నాయి. దేవరపల్లి, బొమ్మూ రులో మోడల్ స్టేషన్ల తరహాలో వాటిని నిర్మిం చనున్నారు.ముఖ్యంగా దేవరపల్లి, గోపాలపురం పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది తీపి కబురని చెప్పవచ్చు. గత టీడీపీ ప్రభు త్వంలో పనుల వరకూ వచ్చినా తర్వాత ప్రభు త్వం మార డంతో ఫలితం లేకుండా పోయింది. శంకుస్థాప నతోనే గత వైసీపీ ఎమ్మెల్యే సరిపెట్టారు. తర్వా త కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టడంతో కొత్త ఫైర్‌స్టేషన్ల ఫైళ్లకు మోక్షం కలుగుతోంది.
దేవరపల్లిలో..
దేవరపల్లిలో కొత్తగా ఫైర్ స్టేషన్ నిర్మాణా నికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2019కి ముందే గోపాలపురంలో ఫైర్ స్టేషన్‌ని అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది.ఆ తర్వా త ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవరపల్లి శివారు రామన్నపాలెం సమీపంలో ఫైర్ స్టేషను నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ సారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో ఫైర్‌స్టేషనుకు మళ్లీ కదలిక వచ్చింది. దేవరపల్లి, గోపాలపురం పరిసర ప్రాంతాల్లో పొగాకు బ్యారన్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఇక్కడ నిత్యం అగ్ని ప్రమాదాలు జరుగు తూనే ఉంటాయి. ఫైర్ స్టేషను లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిడదవోలు లేదా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు లేదా జంగారెడ్డిగూడెం నుంచి 26 కిలోమీటర్లు ప్రయాణించి ఫైర్ ఇంజను రావాల్సి వచ్చేది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ఇప్పు డు దేవరపల్లిలో ఫైర్ స్టేషను వస్తుండడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దేవరపల్లి శివార్లలో కంటే దేవరపల్లి- గోపాలపురం మధ్య గొల్లగూడెం సమీపంలో నిర్మిస్తే అనువుగా ఉం టుందని స్థానికులు చెబుతున్నారు. దేవరపల్లి లో నిర్మిస్తే గోపాలపురం 8 కిలోమీటర్లు ప్రయా ణించాలి. అదే గొల్లగూడెం సమీపంలో అయితే అటూ ఇటూ 4 కిలోమీటర్లలో చేరవచ్చు. ఇక్కడ రెవెన్యూకు ఎకరం భూమి కూడా ఉంది.
బొమ్మూరులో..
గత వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ స్టేషను నిర్మా ణానికి ఎక్కడో వెలుగుబందకు అవతల దూరంగా స్థలం కేటాయించారు. ఇక్కడకు ఫై రింజన్ రాకపోకలు సాగించాలంటే సాధ్య పడ దు. అందువల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగ లేదు. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్యచౌదరి చొరవతో బొమ్మూరు రోడ్డుకు ఓ కిలోమీటరు దూరంలోని సుబ్బాయమ్మ లే- అవుట్‌లో స్థలం కేటాయింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫైర్ స్టేషను నిర్మాణానికి అవసరమైన 30 సెంట్ల భూమిని ఎంత త్వరగా ఫైర్ శాఖకు కేటాయిస్తే అంత మేలు జరుగు తుంది. ఏదేమైనా ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపితే ఈ ఎండాకాలానికి రెండు ఫైర్ స్టేషన్లు సేవకు సిద్ధం అవుతాయి.
మోడల్‌గా నిర్మాణం
జిల్లాలో ప్రస్తుతం నిడదవోలు, కొవ్వూరు, రాజ మండ్రి (ఆర్యాపురం), అనపర్తి, కోరు కొండ లో అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన (ఫైర్ స్టేషను) స్టేషన్లు ఉన్నాయి.ఇప్పుడు రాబో తున్న రెండు ఫైర్‌స్టేషన్లు ప్రస్తుతం ఉన్న వాటి మాదిరిగా కాకుండా మోడల్‌గా నిర్మి స్తారు. ఒక్కో స్టేషనుకు రూ.2.85 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. సిబ్బందికి రెస్ట్ రూ మ్‌లు, ర్యాంపులు, ఆకర్షణీయమైన ఎలివేషన్, స్టోర్ రూమ్స్ వంటివి ఉంటాయి. ఒక్కో స్టేష నులో ఫైరింజనుతో పాటు 16 మంది సిబ్బం ది,ఫైర్ ఆఫీసర్ ఉంటారు.ఈ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాలి.ఈ రెండు ఫైర్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున ఉంటాయి. మొత్తం జిల్లాలో 7 ఫైర్‌స్టేషన్లు ఉంటాయి.