Share News

రాజశేఖర్‌ విజయానికి పాటుపడండి

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:14 AM

ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ విజయానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ పిలుపు నిచ్చారు. జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధు లతో స్థానిక చెరుకూరి కల్యాణమండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారిద్దరూ విచ్చేసి మాట్లాడారు.

 రాజశేఖర్‌ విజయానికి పాటుపడండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల, చిత్రంలో మంత్రి దుర్గేష్‌, అభ్యర్థి పేరాబత్తుల

  • మొదటి ప్రాధాన్య ఓటుతో పేరాబత్తులను గెలిపించాలి

  • రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌

  • జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16 (ఆంధ్ర జ్యోతి): ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ విజయానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ పిలుపు నిచ్చారు. జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధు లతో స్థానిక చెరుకూరి కల్యాణమండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారిద్దరూ విచ్చేసి మాట్లాడారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మొదటి ప్రాధాన్య ఓటుతో పేరాబత్తులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరంను మరోసారి అందరికీ పరి చయం చేశారు. సమావేశంలో జనసేన ఎమ్మె ల్యేలు బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, పంతం నానాజీ, పార్టీ సీనియర్‌ నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ను పునఃప్రారంభించండి

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 16( ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పునఃప్రారంభించాలని కాంట్రాక్టు లెక్చరర్స్‌ 475 అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొర్ల మాణిక్యం కోరారు. స్థానిక చెరుకూరి కల్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పిఠాపురం జనసేన నా యకులు జోగా వీరవెంకటరమణ, సూరంపూడి సురేష్‌, మార్నీడి రంగబాబు, వనం వీరబాబు లతో కలిసి ఈ మేరకు వినతిపత్రం అం దిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నేతల శ్యామ్‌కిరణ్‌, మూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:14 AM