పర్యాటకంగా ‘హేవలాక్’ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:51 AM
గోదావరి పుష్కరాల నాటికి హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ పార్లమెంటు కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఆశీష్‌లాల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

కొవ్వూరులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కృషి: ఎంపీ పురందేశ్వరి
కొవ్వూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల నాటికి హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ పార్లమెంటు కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఆశీష్‌లాల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పాత్రికేయులతో మాట్లాడుతూ కొవ్వూరు రైల్వేస్టేషన్‌ల్లో ఎక్స్‌ప్రెస్‌లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్టవ్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. సికింద్రాబాద్‌లో రైల్వే జనరల్ మేనేజర్‌ని, రైళ్ల నిలుపుదలకు ప్రత్యేక విభాగం ఉందని, వారిని కలిసి కొవ్వూరులో అన్ని ఎక్స్‌ప్రెస్‌ల నిలుపుదలకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హేవలాక్ వంతెన, గోదావరి స్నానఘట్టాల అభివృద్ధికి కేంద్రం రూ.90 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. డిజైన్స్, డీపీఆర్‌లు సిద్ధమైన వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. పుష్కరాలకు రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలులను అభివృద్ధి చేయాలని దృష్టిసారిస్తున్నామన్నారు. వాటిపై డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. కార్యక్రమంలో పరిమి రాధ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, తాడిమళ్ల విజయవాణి, సలాధి సందీప్‌కుమార్, డేగల సునీత, ఇండుగుల రామకృష్ణ పాల్గొన్నారు.