రేపటి నుంచి పి4 సర్వే
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:19 AM
జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు పి4 విధానాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి సమర్ధవంతంగా చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కలెక్ట రేట్ నుంచి పి4పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.

18 నాటికి పూర్తిచేయాలి
21న గ్రామ సభల్లో జాబితా ప్రదర్శించాలి
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం రూరల్, మార్చి 6(ఆంధ్ర జ్యోతి): జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు పి4 విధానాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి సమర్ధవంతంగా చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కలెక్ట రేట్ నుంచి పి4పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజలు, ప్రభుత్వం, ప్రయివేటు భాగస్వా మ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం మార్చి 8నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎన్నికల నియమావళి మేరకు రెండో దశలో మన జిల్లాలో సర్వే జరుగుతుంద న్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా 10 రోజుల వ్యవధిలో సర్వే పూర్తిచే యాలన్నారు. గ్రామంలో పేదల్లో పేదలు 20 శాతం మంది, ఆర్థికంగా అభివృఽఽధ్ధి చెందిన 10శాతం మందిని సర్వే ప్రక్రియలో గుర్తించి వారి వివ రాలు నమోదు చేయాలన్నారు. ఎంపిక విధానం లో నిర్లిప్త ధోరణితో వ్యవ హరించరాదని స్పష్టం చేశారు. మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. దీనికి సంబం ధించి ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్ శిక్షణ పూర్తిచేశామన్నారు. విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నిర్ధేశించిన 10 ప్రాధాన్యత అంశాలను గుర్తించి తగిన విధం గా కార్యాచర ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా నోడల్ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సాంకేతిక పర మైన అంశాలపై డివిజనల్ డెవలప్‌మెంట్ అధి కారి వ్యవహరిప్తారని తెలిపారు. ఈ నెల 18 నాటికి సర్వే పూర్తిచేసి 21 నాటికి గ్రామ సభల్లో జాబితా ప్రదర్శించాలన్నారు. మార్చి 30న ముఖ్య మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఖచ్చితత్వం కలిగిన పనితీరును ప్ర ణాళికా ప్రకారం పూర్తిచేయాలన్నారు. కార్యక్ర మంలో సీపీవో అప్పలకొండ, డీఎల్‌డీవో వీణా దేవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఽ
ఎముకల పటుత్వ పరీక్షలు తప్పనిసరి
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళ ఎముకల పటుత్వ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్ ఫార్మ కంపెనీ సహకారంతో ఉచిత బోన్స్ డెన్సిటీ పరీక్షలు, నెఫ్రోప్లస్ రక్త క్రియాటిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వారి ఇళ్లల్లో ఎక్కువగా శ్రమపడుతుంటారని, కుటుంబ ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ తమ ఆరోగ్యం విషయంలో చూపించరని అన్నారు. ఎముకలు బలంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పటుత్వ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మాట్లాడుతూ ఆసుపత్రిలోని వైద్యులకు, సిబ్బందికి, రోగులకు ఉచితంగా ఈ పరీక్షలు చేసినట్టు తెలిపారు. 200 మందికి పరీక్షలు చేశారని, రిపోర్ట్‌ల ప్రకారం మందులు, ఇతర వైద్య సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ ఎన్‌పీ పద్మశ్రీరాణి, బోధనాసుపత్రి వైద్యులు, సిబ్బంది, సన్‌ఫార్మ ప్రతినిధులు పాల్గొన్నారు.