Share News

పొగాకుపై ‘మాను’కాటు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:38 AM

ఏజె న్సీ, మెట్ట ప్రాంతాల్లో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియ పొగాకు సాగులో మాను మచ్చ ప్రభావం చూపుతోంది. రెండేళ్లుగా కాసుల వర్షం కురిపిస్తున్న పొగాకు సాగుపై ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో రైతులకు మక్కువ విపరీ తంగా పెరిగింది.

పొగాకుపై ‘మాను’కాటు
మానుమచ్చ తెగులు సోకిన పొగాకు మొక్క

  • మొక్క కింది భాగం నుంచి పసుపు రంగులోకి మారుతున్న ఆకులు

  • ఆపై ఎండిపోతున్న వైనం

  • నారుమళ్లు వేసేటప్పుడే విత్తనశుద్ధి చేయాలి

  • మొక్క ఇప్పుడున్న దశలో ఏమి చేయాలేమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

  • దిగుబడిపై రైతుల్లో ఆందోళన

గోపాలపురం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఏజె న్సీ, మెట్ట ప్రాంతాల్లో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియ పొగాకు సాగులో మాను మచ్చ ప్రభావం చూపుతోంది. రెండేళ్లుగా కాసుల వర్షం కురిపిస్తున్న పొగాకు సాగుపై ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో రైతులకు మక్కువ విపరీ తంగా పెరిగింది. దీంతో కొండలు, గుట్టలు, మెట్ట లు అనే తారతమ్యం లేకుండా భూమి చదును చేసి పొగాకు సాగు చేస్తున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వందలాది ఎకరాల్లో సాగ వుతుంది. అందుకు ధీటుగా పొగాకు క్యూరింగ్‌ చేసేందుకు మండల వ్యాప్తంగా నూతనంగా బ్యారన్‌ల నిర్మాణాలు సాగుతున్నాయి. కొన్ని అధికారికం కాగా, మరికొన్ని అనధికారికం. కాగా ఈ ఏడాది వరుస తుఫాన్ల ప్రభావంతో పొగాకు నాట్లు ఆలస్యంగా జరిగాయి. నాట్లు ఆలస్యంగా వేసినా మొక్క పెంపకంపై దృష్టి సారించిన రైతాంగం వెనుకాముందు చూడకుండా పెట్టుబ డులు విపరీతంగా పెట్టారు. దీంతో రైతు ఆశిం చినంత దిగుబడి వచ్చేలా పొగాకు తోటలు ఎది గాయి. ఈ ప్రాంతంలో విత్తనం దగ్గర నుంచి పొగాకు విక్రయించే వరకు ఎకరానికి 6 వేల మొక్కలకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. సగటున ఒక్కొక్క పొగాకు మొక్క పెంచడానికి సుమారు రూ.35 వరకు ఖర్చవుతుంది. అలా పెంచిన మొక్కకు సుమారు ముప్పావు కిలో(సు మారు 24ఆకులు) నుంచి కిలో వరకు దిగుబడి వస్తుంది. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క పొగాకు మొక్కకు గత ఏడాది ధరలను బట్టి చూస్తే ఒక మొక్కకు రూ.400 వరకు ఆదాయం లభిస్తుంది. ఎంతో పెట్టుబడులు పెట్టి మరీ తోటలను ఏపుగా పెంచి క్యూరింగ్‌ దశకు వచ్చే సరికి పొగాకు తోటలను మానుమచ్చ (వేరుకుళ్లు) తెగులు వెంటాడుతోంది. దీంతో పొగాకు మొక్క కింది నుంచి పైకి ఒకేసారి ఆకులన్నీ పండిపోయి అనంతరం వాడి ఎండిపోతోంది. ఈ తెగులు నియంత్రణకు ఎటువంటి మందులు అందుబాటులో లేవని, శాస్త్రవేత్తలు అంటున్నారు. నారు వేసే సమయంలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే నారు నాటే సమయంలో రసాయన ద్రావణంలో మొక్క వేరును తడిపి నాటాలం టున్నారు. ఈ రెండు తప్పనిసరిగా చేస్తే వేరుకుళ్లు తెగులు రాదని, ఆ రెండు చేయకపోవడం వల్లనే ఈ తెగులు వచ్చిందని, మొక్క ఇప్పు డున్న దశలో ఏ రసాయన మందులు దానిని నియంత్రించలేవని పేర్కొంటున్నారు. దీంతో ఏపుగా పెరిగిన పంటను చూసి రైతు ఆనందిం చాలో లేక తోటలో మానుమచ్చ కారణంగా ఎండిపోతున్న మొక్కలను చూసి నిరుత్సాహప డాలో తెలియక రైతులు ఆందోళన చెందుతు న్నారు. గోపాలపురం పోగాకుబోర్డు పరిధిలో 2215మంది రైతులు 2702 బ్యారన్లలో 5122 హెక్టార్లు పొగాకు సాగు జరుగుతోంది. అలాగే దేవరపల్లి పొగాకు బోర్డు పరిధిలో 1549 మంది రైతులకు సంబంధించి 1780 బ్యారనన్లు 3337 హెక్టార్లలో పొగాకు సాగువుతోంది. విపరీతంగా పెరిగిన ఈ పొగాకు సాగులో లక్షలాది రూపా యలు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉంటాయని కొందరూ రైతులు చెబుతుంటే, మరికొందరు వేరుకుళ్లు తెగులును ఎలా నియంత్రించాలోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:38 AM