Share News

పులి..చిక్కేనా!

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:51 AM

అసలు ఉభయగోదావరి జిల్లాల్లో పులులు ఎన్ని ఉన్నాయి..? పులులా అవెక్కడుంటాయి..! మన జిల్లాల్లో అసలు పులులు లేవనేది చాలామంది వాదన. ఇది నిజం కాదు.. మన జిల్లాల్లోనూ పులులు ఉన్నాయి.. ఎక్కడో తెలుసా పాపికొండల అభయారణ్యంలో..

పులి..చిక్కేనా!
టైగర్‌

వచ్చే ఏడాదే పులుల గణన

మే నెలలో లెక్కింపు

200కిపైగా సీసీ కెమెరాలు

శ్రీశైలం నుంచీ నిపుణులు

పులులు పెరిగే అవకాశం

12 ఉండొచ్చని అంచనా

చివరిగా 2022లో సర్వే

6 చిరుతలు,4 పులులు గుర్తింపు

90 రోజుల పాటు సర్వే

రంగంలోకి ఎన్‌టీసీఏ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అసలు ఉభయగోదావరి జిల్లాల్లో పులులు ఎన్ని ఉన్నాయి..? పులులా అవెక్కడుంటాయి..! మన జిల్లాల్లో అసలు పులులు లేవనేది చాలామంది వాదన. ఇది నిజం కాదు.. మన జిల్లాల్లోనూ పులులు ఉన్నాయి.. ఎక్కడో తెలుసా పాపికొండల అభయారణ్యంలో.. ఆ లెక్క ఎలా అంటారా.. నాలుగేళ్లకోసారి పులుల గణన చేపడతారు.. ఉభయగోదావరి జిల్లాల్లో 2022లో చేపట్టారు.. ఒక్క రోజు రెండు రోజులు కాదండోయ్‌ ఏకంగా 90 రోజులపాటు లెక్కించారు.. నాడు అభయారణ్యంలో ఆరు చిరుతలు.. నాలుగు పెద్ద పులులు ట్రాప్‌ కెమెరాలకు చిక్కాయి.. వచ్చే ఏడాది మళ్లీ పులుల గణన చేపట్టనున్నారు.. ఎందుకంటే గతేడాది ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అడపాదపడా జనారణ్యంలోకి పులులు వచ్చిన ఘటనలు ఉన్నాయి.. దీనిలో భాగంగా ఇప్పటినుంచే అధికారులు సన్నద్ధమవుతున్నారు.. అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరికి ఇరువైపులా విస్తరించి ఉన్న పాపికొండల అభ యారణ్యంలో పులుల సంఖ్యను లెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మే నుంచి సర్వే చేపట్టాల్సి ఉండడంతో సన్నద్ధమవుతున్నారు. ఏటా నాలుగేళ్లకోసారి జా తీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆదేశాల మేరకు అటవీశాఖ పాపికొండల్లో 90 రోజుల పాటు పులుల లెక్కింపు నిర్వహిస్తుంది. చివరిగా 2022లో సర్వే జరిగింది. నాలుగేళ్లు పూర్తవడంతో వచ్చే ఏడాది మేలో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గతంతో పోల్చితే ఈసారి పాపికొండల్లో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పాపికొండలే ఆవాసం..

పులులు,చిరుత పులులకు పాపికొండల అభ యారణ్యం పెట్టింది పేరు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఏజెన్సీ కలిపి మొత్తం 2.60 లక్షల ఎకరాల్లో పాపికొండలు విస్తరించి ఉన్నా యి. దూరంలో చెప్పాలంటే మొత్తం 391 చద రపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్నాయి. పాపికొండల మధ్యలో గోదావరి నది ఉంది. అందుకే పులుల రక్షణ ప్రాంతంగా పాపికొండలు ప్రసిద్ధి చెందా యి. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఇక్కడ అనేక రకాల పక్షులు, జంతువులు సంచరిస్తుం టాయి. దీంతో ఆహారం, నీటికి ఏ మాత్రం పులు లకు ఢోకా ఉండదు. ఈనేపథ్యంలో పులుల ఆవాస ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కింది.

ఈసారి పెరగడం ఖాయమే..

వచ్చే ఏడాది మేలో చేపట్టనున్న సర్వేకు సంబంధించి త్వరలో సన్నాహాలు ప్రారంభించ డానికి అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈసారి మరింత పగడ్బందీగా పులుల లెక్క తేల్చాలని భావిస్తోంది.ఈ మేరకు అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. వాస్తవానికి పలుసార్లు సర్వే కోసం ట్రాప్‌ కెమెరాలు ఏర్పా టు చేస్తున్నా అవి చిక్కడం లేదు. దీనివల్ల వాస్తవ సంఖ్య తేలడం లేదు. మే నెలలో చేపట్ట నున్న సర్వే సయయానికి అడవుల్లో చెట్ల ఆకు లు రాలిపోయి కెమెరాలు బిగించడం కొంత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అటు ట్రాప్‌ కెమెరాలో వీడియోలు సైతం రికా ర్డవడానికి అనువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాంతం నుంచి నిపుణులను రప్పించనున్నారు. ఈ దఫా సర్వేలో పాపికొండల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గడచిన నాలుగేళ్లలో వీటి సంతానం కూడా బాగా వృద్ధి చెంది ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోల వరం ప్రాజెక్టు మీదుగా రంప ఏజెన్సీ వరకు విస్తరించి ఉన్న పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగా పెరిగిందని అటవీశాఖ అంచనా వేసింది. ప్రధానంగా రంప అటవీ ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాకు చిక్కని చిరుతలు 12 వరకు ఉంటాయని చెబుతున్నారు.

చివరిగా 2022లో సర్వే

పాపికొండల్లో పులులు, చిరుతలు ఎన్ని ఉన్నా యి? అనే దానిపై రాజమహేంద్రవరం అటవీ శాఖ అధికారులు రంపచోడవరం, కాకినాడ అటవీ శాఖల సాయంతో నాలుగేళ్లకోసారి పులుల లెక్కింపు చేపడతాయి. చివరిగా పాపి కొండల్లో 2022లో పులుల లెక్కింపు జరిగింది. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరి ధిలో విస్తరించి ఉన్న పాపికొండల అభయా రణ్యం పరిధిలో 45 రోజులు, ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా అభయారణ్యం పరిధిలో 45 రోజులపాటు సర్వే చేశారు. రెండు దశల్లో కలిపి అభయారణ్యంలోని 116 ప్రాంతాల్లో 232 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి పులుల సంఖ్య లెక్కించారు. నాలుగు పెద్దపులులు, ఆరు చిరుత పులులు గుర్తించారు. అయితే ట్రాప్‌ కెమెరాకు చిక్కని చిరుత పులులు మాత్రం ఇంకో 12 వరకు ఉండొచ్చని అంచ నా వేశారు. రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లోను పులులకంటే చిరుతల సంచా రం అధికంగా ఉందని నిర్ధారించారు. 2018లో నిర్వహించిన సర్వేలో అసలు ట్రాప్‌ కెమెరా లకు పులులు, చిరుతలు చిక్కలేదు. దీంతో ఆ ఏడాది సర్వే వివరాలు బయటపెట్టలేదు.

గతేడాది ఇలా..

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్న పాపి కొండల అభయారణ్యం నుంచి గతేడాది దారి తప్పి పులులు జనావాసాల్లోకి వచ్చేసిన సం ఘటనలను గుర్తు చేస్తున్నారు. గతేడాది ఫిబ్ర వరిలో ఏలూరు జిల్లా పరిధిలోకి ఓ మగ పులి పాపికొండల అభయారణ్యం నుం చి వచ్చింది. అక్టోబరులో ప్రత్తిపాడులో పులి సంచారం ఆనవాళ్లు బయటపడ్డాయి. 2022 మేలో ఓ పులి ఏజెన్సీ మీదుగా ప్రత్తిపాడు, శంఖవరం, తుని రూరల్‌ మీదుగా వెళ్లింది. ప్రత్తిపాడులో బోనులోకి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. గతేడాది సెప్టెంబరులో రాజ మహేంద్రవరం నగరంలోకి చిరుత పులి దారితప్పి వచ్చేసింది. ఇది పాపికొండల అభయారణ్యం నుంచే వచ్చిందని గుర్తించా రు.అప్పట్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు అడవుల్లో పులులు, చిరుతల స్థావరాలు చెల్లాచెదురయ్యాయి. దీంతో కొత్త స్థావరం కోసం వెదికే క్రమంలో చిరుత గోదావరి ఈదుకుంటూ రాజమహేంద్రరంలోకి వచ్చి ఉండొచ్చని అప్పట్లో అంచనా వేశారు. పాపి కొండల అభయారణ్యం విస్తరించిన ఏజెన్సీ ప్రాంతం లోను వీఆర్‌పురం, రంపచోడవరం, మారేడుమిల్లి, గోకవరం మీదుగా చిరుత రాజమహేంద్రవరంలోకి దారితప్పి వచ్చి ఉం డొచ్చని భావించారు. ప్రధానంగా ఈ తరహా సంఘటనలు 2022 నుంచి 2024 మధ్యే ఎక్కువగా జరిగాయి. పాపికొండల అభయా రణ్యంలో పెరిగిన పులుల సంచారానికి ఈ ఘటనలు నిదర్శనంగా భావించొచ్చని అధి కారులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఏడాది మే తర్వాత ఈ లెక్కకు సంబంధించి దాదాపు స్పష్టత రావొచ్చని చెబుతున్నారు.

============================

Updated Date - Feb 13 , 2025 | 12:51 AM