Share News

అమ్మాయిలూ.. జాగ్రత్త!

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:07 AM

ఉపాధి నిమిత్తం ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చారు.. జిల్లాలోని ఒక పట్టణంలో స్థిరపడ్డారు. ఏ బాదరబందీ లేదు.. ఒక్కతే కుమార్తె.. అమ్మాయిది డిగ్రీ పూర్తయింది.. ఉద్యోగమూ వచ్చేసింది..

అమ్మాయిలూ.. జాగ్రత్త!

ప్రేమ పేరుతో యువకుల వల

8 చిక్కిపోతున్న అమ్మాయిలు

స్మార్ట్‌ ఫోన్లతో పతనం

బలహీన క్షణాల్లో బంధీగా

తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు

చివరికి మిగిల్చేది కన్నీళ్లు

పోలీస్‌స్టేషన్లలో కేసులు

నిడదవోలు ఘటనే నిదర్శనం

గతేడాది అత్యాచార కేసులు 43

యువతుల మిస్సింగ్‌ 145

మహిళల అదృశ్యం 258

పోలీసులకూ సవాల్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఉపాధి నిమిత్తం ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చారు.. జిల్లాలోని ఒక పట్టణంలో స్థిరపడ్డారు. ఏ బాదరబందీ లేదు.. ఒక్కతే కుమార్తె.. అమ్మాయిది డిగ్రీ పూర్తయింది.. ఉద్యోగమూ వచ్చేసింది.. ఆ తల్లిదండ్రులకు ఇంకేం ఆలోచన ఉంటుంది..మంచి అబ్బాయిని చూసి పెళ్లిచేయడమే తరువాయి..ఇలా అనుకుంటుండగానే ఆ అమ్మాయి చేసిన స్నేహం కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది.. నాకు అడిగినంతా ఇవ్వకపోతే నీ న్యూడ్‌ వీడియోలు నెట్‌లో పెడతానని బెదిరించడంతో యువతి.. తల్లిదండ్రులు బెదిరిపోయారు.. అడినంతా ఇచ్చి అప్పులపాలయ్యారు. సొంతిల్లు వదిలేసి అద్దె ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితికి తెచ్చింది.. చివరికి చేసేదేంలేక పోలీసులను ఆశ్రయిం చడంతో ఐదేళ్ల ఆవేదన బయటకొచ్చింది.

కొవ్వూరుకు చెందిన ఒక బాలిక ఇంటర్‌ చదువుతోంది.. తల్లిదండ్రులకు కష్టమైనా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళా శాలలో చదివిస్తున్నారు.. ఆ అమ్మాయిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అయితే చదువుకోవడానికి వెళ్లిన అమ్మాయి అక్కడ అఽధ్యాపకుడు చెప్పిన మాయమాటలకు లొంగిపోయింది.. ఇటీవల అతను వెంట తీసుకెళ్లిపోయి అత్యాచారానికి ఒడిగట్టాడు. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పట్టుకున్నారు.. బాలిక ఫిర్యాదు మేరకు అధ్యాపకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు మోసపో తున్న ఘటనలు సర్వసాధారణంగా మారిపో యాయి.. ప్రతి రోజూ ఏదో ఒక మూల కేసులు నమోదవుతూనే ఉన్నాయి.అయినా అమ్మాయిల్లో మాత్రం మార్పురావడం లేదు.. స్మార్ట్‌ ఫోన్లు.. దానికి తగినట్టు స్నేహాలు అమ్మాయిల జీవితాలను అడ్డదారి పట్టిస్తున్నా యనడంలో సందేహం లేదు. జిల్లా వ్యాప్తంగా గతేడాది చూస్తే 43 పోక్సో కేసులు నమోద య్యాయి.145 అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు ఉన్నాయి.. వివాహిత మహిళల అదృశ్యం కేసులు 258.. ఇవి పోలీస్‌ స్టేషన్లకు వరకూ వచ్చినవి..రానివి ఎన్నో చెప్పడం కష్టమే.. ఈ కేసుల్లో ప్రతి కేసూ ఒక కథే.. మోసపోయిన జీవితగాధలే.. కొంత మంది ఆ మోసాల నుంచి బయటపడుతుంటే.. మరికొంత మంది భరించలేక ప్రాణాలే తీసుకుంటున్నారు..

ప్రేమ ఆకర్షణ

ప్రేమ.. ఆకర్షణ.. అవసరం.. వాంఛ.. వీటి మధ్య ఉన్న సున్నితమైన గీతను గుర్తించడంలో విఫలమవుతున్న అమ్మాయిలు అమాయకంగా తమంతట తాముగా వెళ్లి తమ జీవితాలను, తమ తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేసే వలకు చిక్కుతూ చిక్కుముడుల సుడిగిండంలో ఇరు క్కుంటున్నారు. తీరా ఆ ‘క్షణాల’ తప్పును గ్రహించే సరికి వేధింపుల గుప్పిట్లో బంధీల వుతున్నారు. భారతీయ సంస్కృతిలో ఆడవారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.ఎంతో గౌరవాన్ని ఇచ్చింది. కానీ ఇవాళ పాశ్చాత్య పోకడల వెర్రిలో తెల్ల కాగితంలా ఉండాల్సిన జీవితాలు మసి బారిపోతున్నాయి. ఇటు తల్లిదండ్రులను సమా జంలో, బంధువుల్లో చులకన చేస్తున్నారు. ఆలో చనా లేమితో కొందరు అమ్మాయిలు చేస్తున్న చక్కదిద్దుకోలేని పొరబాట్లకు ప్రతిక్షణం కుంగి పోతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్న అమ్మా నా న్నలు ఎంతో మంది ఉన్నారు. కొందరు అమ్మా యిలు కెరీర్‌ అంటూ ముందుకు దూసుకుపో తుంటే..మరికొందరు ‘క్షణాల్లో’ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.చాలా మంది సెల్‌ఫోన్ల వల్ల పతనం అవుతున్నారనేది నిర్వివాదాంశం. అం దుకే..‘అమ్మాయిలూ..కాస్త ఆలోచించండమ్మా!’. స్నేహమన్నా.. జాగ్రత్తగా ఉండాల్సిందే..

స్నేహం మాటున..

స్నేహం మాటున ఇవాళ జరుగుతున్న ఆకృ త్యాలు అమ్మాయిల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కట్టు తప్పుతూ పట్టు కోల్పోతు న్నారు. తమ అత్మాభిమానాలను సైతం ఇత రుల చేతిలో బంధీ చేస్తున్నారు. ఎక్కడో ఏదో సందర్భంలో స్నేహమంటూ నాలుగు మాటలు కలుపుతారు. దానిని కొద్ది రోజులు సాగదీస్తూ వెళతారు. ఆపై ఆకర్షణకు లొంగిపోతారు. చిక్కుముడిలో చిక్కిపోతున్నారు. గతంలో స్నేహం చేశారంటే ఒక నమ్మకం ఉండేది.. నేడు అవసరమే స్నేహంగా మారింది.అది గుర్తించ లేని అమ్మాయిలు మోసగాళ్ల వలకు చిక్కి బలై పోతున్నారు. ఆధునిక జీవులం అనుకుంటూ అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నారు. ఆడ పిల్ల పుట్టిన నాటి నుంచే ఎంతో పొందికగా పెంచి పెద్ద చేయాలని పెద్దలు తాపత్రయ పడతారు. అలాగే పెంచుతారు. అయితే చిన్న తప్పుతో జీవితాలను బలిచేసుకుంటున్నారు.

అత్యాచార కేసులు 43.. అమ్మాయిల మిస్సింగ్‌ 145

తూర్పు గోదావరి పోలీసు రికార్డుల ప్రకారం గతేడాది 18ఏళ్ల పైబడిన వారిపై 23,18ఏళ్ల లోపు అంటే పిల్లలపై 43 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ 43 కేసుల్లో ఓ ఏడు తప్ప..36 ప్రేమ పేరుతో పరారైనవే కావడం గమనార్హం. ఇక ఆ 23 కేసుల్లో నాలుగు తప్ప మిగతా వాటిలో పెళ్లి చేసుకుంటామని చెప్పినవి ఉన్నాయి.ఈ గణాంకాలు చూస్తుం టే ఎంత మంది తల్లిదండ్రులు శోకంలో జీవిస్తున్నారో.. బంధువులు, ఇరుగుపొరుగు వారి ముందు తలదించుకొని బతుకుతు న్నా రో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆడపిల్లల మిస్సింగ్‌ కేసులు 145 నమోదు కాగా 142 మందిని పోలీసులు గుర్తించి తీసుకొచ్చారు. మహిళల అదృశ్యం కేసులు 258 ఉండగా 233 మందిని పోలీసులు గు ర్తించారు.ఇవి పోలీస్‌ స్టేషన్ల వరకూ వచ్చిన కేసులు మా త్రమే..రాని కేసులు చాలానే ఉంటాయి. ఎం దుకంటే పరువు పోతుందనే కారణంగా పోలీస్‌ స్టేషన్ల వరకూ రాని కేసులు పదుల సంఖ్యలో ఉంటాయి.మాయమాటలతో విసిరే వలలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసు కోవద్దంటూ ఉదాహరణలను వివరిస్తూ పోలీ సులు అవగాహన కల్పిస్తున్నా కొందరు అమ్మాయిలు ఇంకా జీవిత సత్యాన్ని గ్రహిం చలేక పోవడం బాధాకరంగా కానవస్తోంది.

Updated Date - Feb 05 , 2025 | 01:07 AM