వాడపల్లి ఒకరోజు ఆదాయం రూ.4.45 లక్షలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:52 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

ఆత్రేయపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం లో పాల్గొన్నారు. ఆదివారం వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.4,45,856 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
వెంకన్న ఆలయంలో ఆర్జేసీ పూజలు: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆది వారం దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనరు, సింహాచలం అప్పన్న ఆలయ ఈవో యాండ్ర త్రినాఽథరావు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చక బృందం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలు అందించారు.